Begin typing your search above and press return to search.

ఆ ఫ్యామిలీ గురించి సుబ్బరాజు చెప్పాడా?

By:  Tupaki Desk   |   22 July 2017 11:13 AM IST
ఆ ఫ్యామిలీ గురించి సుబ్బరాజు చెప్పాడా?
X
డ్రగ్స్ ఉదంతం టాలీవుడ్ ను కుదిపేస్తూనే ఉంది. రోజుకొకరు చొప్పున సిట్ విచారిస్తుండగా.. ఎప్పటికప్పుడు బయటకు వస్తున్న కొత్త లీకులు ఇండస్ట్రీని షేక్ చేసేస్తున్నాయి. మూడో రోజున సుబ్బరాజును విచారించిన అధికారులు.. దాదాపు 13 గంటల పాటు ప్రశ్నలు సంధించడం అనేక అనుమానాలకు తావిస్తోంది.

సుబ్బరాజు విచారణ పూర్తి కాగానే.. మీడియాలో వస్తున్న కథనాలు ఇంకా కలకలం సృష్టిస్తున్నాయి. ఈ ఆర్టిస్ట్ అనేక మంది పేర్లు బయటపెట్టేశాడని అంటున్నారు. ఇప్పటికే 12 మందికి డ్రగ్స్ కేసులో విచారణ హాజరు కావాలని నోటీసులు అందగా.. సుబ్బరాజు మరో 15 మంది పేర్లు చెప్పేశాడట. ఇందులో పెద్ద తలకాయలు కూడా ఉన్నాయని టాక్. ముఖ్యంగా ఇండస్ట్రీకి దశాబ్దాలుగా సేవలు అందిస్తున్న ఓ కుటుంబానికి సంబంధించిన గుట్టు కూడా సుబ్బరాజు విప్పేశాడని అంటున్నారు. అదే కుటుంబంలో ఇద్దరు డ్రగ్స్ ఉపయోగిస్తారని చెప్పడమే కాదు.. ఏయే ప్రాంతాల్లో కూడా సుబ్బరాజు చెప్పాడని ఛానల్స్ లో కథనాలు వస్తున్నాయి.

మీడియాలో వస్తున్న కథనాలు నిజం అయితే మాత్రం ఈ కేసు ఇంకా జటిలం కానుందని.. టాలీవుడ్ కు మాయని మచ్చలా మిగలనుందనే చెప్పాలి. అయితే.. ఇప్పటివరకూ మీడియాకు వచ్చిన లీకుల్లో చాలా వరకూ నిజం అయ్యాయనే విషయాన్ని గుర్తు చేసుకుంటే.. ఇప్పుడు సుబ్బరాజు విషయంలో వస్తున్న కథనాల్లో కూడా కొంత మేర వాస్తవం ఉండొచ్చని అనిపిస్తుంది.