Begin typing your search above and press return to search.
కేటీఆర్ కు 'కుమార వర్మ' సర్ ప్రైజ్!
By: Tupaki Desk | 4 Aug 2018 3:00 PM GMTతెలంగాణ ఐటీ శాఖ - మునిసిపల్ శాఖా మంత్రి కేటీఆర్ కు మంచి ఫాలోయింగ్ ఉన్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా సినీ రంగానికి చెందిన పలువురు హీరో హీరోయిన్ లు - దర్శకనిర్మాతలు - నటీనటులతో కేటీఆర్ కు మంచి సాన్నిహిత్యం ఉంది. ఆ సాన్నిహిత్యంతోనే తెలంగాణలో చేపట్టే పలు సామాజిక కార్యక్రమాలకు సినీ ప్రముఖులు తమ మద్దతు తెలుపుతుంటారు. హరితహారంలో భాగంగా `గ్రీన్ ఇండియా చాలెంజ్ 'ను పలువురు సినీ ప్రముఖులు ప్రమోట్ చేస్తోన్న సంగతి తెలిసిందే. కొద్ది రోజుల క్రితం తన అవార్డు ద్వారా వచ్చిన రూ.25లక్షలను హీరో విజయ్ దేవరకొండ ...సీఎం రిలీఫ్ ఫండ్ కు ఇచ్చి తన ఉదారతను చాటుకున్న సంగతి తెలిసిందే. తాజాగా, అదే బాటలో టాలీవుడ్ విలక్షణ నటుడు సుబ్బరాజు కూడా సీఎంఆర్ ఎఫ్ కు విరాళమిచ్చారు. ఈ విషయాన్ని కేటీఆర్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా వెల్లడించారు.
ఓ ఫ్యామిలీ ఫంక్షన్ కు హాజరైన కేటీఆర్ ను సుబ్బరాజు కలిశారు. అయితే, ఆ ఫంక్షన్ కు వచ్చిన సుబ్బరాజు తనను మామూలుగా కలిశారని కేటీఆర్ అనుకున్నారట. కానీ, అనూహ్యంగా కేటీఆర్ ను సుబ్బరాజు సర్ ప్రైజ్ చేశారట. తాను కూడా సీఎంఆర్ ఎఫ్ కు విరాళం ఇవ్వాలనుకుంటున్నానని ఓ చెక్‌ను కేటీఆర్‌కు అందజేశారట. అయితే, ఎలాంటి హంగూ ఆర్భాటం లేకుండా చాలా సింపుల్ గా కేటీఆర్ కు చెక్కు ఇవ్వడంతో కేటీఆర్ ఆశ్చర్యపోయాట. ఇదే విషయాన్ని కేటీఆర్ ట్వీట్ చేశారు. ‘‘రాత్రి నేను ఓ ఫ్యామిలీ ఫంక్షన్‌లో ఉండగా.....సుబ్బరాజు నా దగ్గరకు వచ్చి సీఎంఆర్ఎఫ్ కోసం ఓ చెక్ ను కంట్రిబ్యూట్ చేయడంతో ఆశ్చర్యపోయాను. చాలా కృతజ్ఞతలు బ్రదర్’’ అని కేటీఆర్ ట్వీట్ చేశారు. రీల్ లైఫ్ లో విలన్ క్యారెక్టర్లు పోషించిన సుబ్బరాజు..... రియల్ లైఫ్‌లో మాత్రం హీరో అంటూ నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.