Begin typing your search above and press return to search.
శ్రీదేవి గురించి ఆ ప్రచారం అబద్ధమన్న పెద్దాయన
By: Tupaki Desk | 5 March 2018 8:54 AM GMTశ్రీదేవి జీవితమంతా అశాంతే అంటూ ఆమె వీరాభిమాని రామ్ గోపాల్ వర్మ ఇటీవలే ఒక సుదీర్ఘ లేఖ రాసిన విషయం తెలిసిందే. అందులో భాగంగా శ్రీదేవి సంపాదించిన డబ్బంతా పొగొట్టుకున్నట్లుగా చెప్పాడు వర్మ. శ్రీదేవి తండ్రి మరణం తర్వాత శ్రీదేవి డబ్బు, ఆస్తుల్ని సరిగా డీల్ చేసే వాళ్లు లేకపోయారని.. ఆమె తల్లి పెట్టుబడుల విషయంలో మోసపోయిందని.. శ్రీదేవి సోదరి శ్రీలత బలవంతంగా ఆస్తులన్నీ రాయించుకుందని వర్మ అందులో చెప్పడం తెలిసిందే. ఒక దశలో శ్రీదేవి చేతిలో చిల్లిగవ్వ లేని పరిస్థితి తలెత్తిందని.. అలాంటి సమయంలోనే అప్పుల్లో కూరుకుపోయిన బోనీ ఆమెను పెళ్లాడాడని కూడా చెప్పాడు.
జనాలకు ఆల్రెడీ శ్రీదేవి ఆర్థిక పరిస్థితిపై సందేహాలుండగా.. వర్మ లేఖతో ఈ అనుమానాలు మరింత బలపడ్డాయి. ఐతే శ్రీదేవికి సన్నిహితుడైన టి.సుబ్బిరామిరెడ్డి మాత్రం అందరూ అనుకుంటున్నట్లుగా ఆమెకు ఆర్థిక సమస్యలేమీ లేవన్నాడు. శ్రీదేవి సంస్మరణ సభలో ఆయన మాట్లాడుతూ.. శ్రీదేవిపై జరుగుతున్న ప్రచారాన్ని ఖండించాడు. శ్రీదేవి కెరీర్ పుంజుకుంటున్న సమయంలో ఆమె తల్లి చెన్నైలో స్థలాలు కొనుగోలు చేసిందని.. ఆ స్థలాలు అమ్మేసి హైదరాబాద్ లో ఏమైనా కొనాలా అని శ్రీదేవి తనను చాలాసార్లు సలహా అడిగిందని సుబ్బిరామిరెడ్డి చెప్పారు. శ్రీదేవి కొంచెం డబ్బులు పోగొట్టుకుని ఉంటే పోగొట్టుకుని ఉండొచ్చని.. కానీ ఆమె ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయినట్లుగా జరిగిన ప్రచారం మాత్రం అవాస్తవమని.. తనకు తెలిసి ఆమె ఆర్థిక పరిస్థితి చాలా బాగానే ఉందని ఆయన స్పష్టం చేశారు