Begin typing your search above and press return to search.

వారిద్దరి విడాకుల రూమ‌ర్ అలా వ‌చ్చింద‌ట‌

By:  Tupaki Desk   |   26 Jun 2018 1:30 AM GMT
వారిద్దరి విడాకుల రూమ‌ర్ అలా వ‌చ్చింద‌ట‌
X
క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్ గా సుప‌రిచితుడు శుభ‌లేఖ సుధాక‌ర్‌. ఒక‌ప్పుడు ఆయ‌న ప్ర‌తి సినిమాలోనూ క‌నిపించేవాడు. ఆయ‌న లేని సినిమాలు చాలా త‌క్కువ‌గా ఉండేవి. అలాంటి ఆయ‌న త‌ర్వాతి కాలంలో అవ‌కాశాలు బాగా త‌గ్గిపోయాయి. ఆ మ‌ధ్య‌న విడుద‌లైన గౌత‌మిపుత్ర శాత‌క‌ర్ణిలో న‌టించిన ఒక్క సీన్ అయినా.. త‌న స‌త్తా ఏమిటో చాటారు.

ప్ర‌ముఖ గాయ‌ని శైల‌జ‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్న (ల‌వ్ క‌మ్ ఆరేంజ్డ్ అని చెప్పాలి. ఎందుకంటే.. తొలుత శుభ‌లేఖ సుధాక‌ర్ ప్ర‌పోజ్ చేస్తే శైల‌జ నో చెప్ప‌టం.. త‌ర్వాత పెద్ద‌లు మాట్లాడుకొని ఓకే చేయ‌టం జ‌రిగింది) వారిద్ద‌రూ అనోన్యంగా జీవిస్తున్నారు.

అయితే.. ఆ మ‌ధ్య‌న వారిద్ద‌రూ విభేదాల‌తో విడిపోయిన‌ట్లుగా వార్త‌లు వ‌చ్చాయి. ఎప్పుడూ ఎలాంటి సంచ‌ల‌న వార్త‌ల్లో క‌నిపించ‌ని ఈ జంట‌.. అందుకు భిన్నంగా విడిపోయార‌న్న ప్ర‌చారం జ‌ర‌గ‌టం హాట్ టాపిక్ అయ్యింది. ఇంత‌కీ ఈ రూమ‌ర్ ఎందుకు వ‌చ్చింది? ఎలా వ‌చ్చింది? అన్న విష‌యాన్ని శుభ‌లేఖ సుధాక‌ర్ ను ఒక షోలో నేరుగా అడిగేస్తే.. ఆయ‌న ఆస‌క్తిక‌ర అంశాన్ని చెప్పారు.

"సార‌థీ స్టూడియోలో ఈశ్వ‌ర్ అల్లా సినిమా షూటింగ్ జ‌రుగుతున్న‌ప్పుడు ఒక జ‌ర్న‌లిస్టు త‌న ద‌గ్గ‌ర‌కు వ‌చ్చి.. మీరిద్ద‌రూ విడిపోయార‌ట క‌దా? అని అడిగారు. ఎవ‌రు చెప్పారంటే.. త‌మిళ వాళ్లు ఎవ‌రో చెప్పిన‌ట్లుగా చెప్పారు. అయితే.. రేపు నేను ఊరు వెళుతున్నా. అక్క‌డ మీరు శైలును చూస్తే స‌రి. లేదంటే లేద‌న్నా. దానికి ఆయ‌న కామెడీగా చెప్పే క్ర‌మంలో శుభ‌లేఖ సుధాక‌ర్‌.. శైల‌జ విడిపోయారా? అంటే హెడ్డింగ్ పెట్టారు. మా మ‌ధ్య‌న జ‌రిగిన సంభాష‌ణ అంతా రాశారు. కానీ.. మ్యాట‌ర్ క‌న్నా.. హెడ్డింగ్ లోనే ఎవ‌రికి వారు కావాల్సింది తీసుకోవ‌టంతో రూమ‌ర్స్ స్ప్రెడ్ అయ్యాయి అని చెప్పారు. అయినా.. అర్థం చేసుకోవాల్సింది త‌ను.. నేను.. మా ఇద్ద‌రి కుటుంబాలే కానీ మిగిలిన వారితో మాకు సంబంధం లేదు" అంటూ అస‌లు విష‌యాన్ని చెప్పారు.