Begin typing your search above and press return to search.
ట్రైలర్ టాక్: గాంధార లిపి అంతరించిపోయిన భాష
By: Tupaki Desk | 21 Nov 2018 3:25 PM GMTసుమంత్-ఈషా రెబ్బా హీరో హీరోయిన్లుగా తెరకెక్కుతున్న థ్రిల్లర్ చిత్రం 'సుబ్రహ్మణ్యపురం'. ఈ సినిమా ట్రైలర్ ఈరోజే రిలీజ్ అయింది. సుబ్రహ్మణ్యపురం అనే ఊరిలో జరిగే అంతుచిక్కని సంఘటనలు.. దాని సంగతి ఏంటో తేల్చేవరకూ నిద్రపోనని పంతంతో ఉన్న హీరో. ఇది స్థూలంగా కథ.
"ఏదో జరుగుతోంది మీ ఊర్లో" అంటాడు సుమంత్ సుబ్రహ్మణ్యపురంలో జరిగే సంఘటనల గురించి మాట్లాడుతూ. మరో సందర్భంలో 'గాంధార లిపి కొన్ని వందల సంవత్సరాల క్రితం అంతరించిపోయిన భాష' అంటూ ఆ లిపిలో ఉన్నదానిని చూపిస్తూ అంటాడు. ఇక సుబ్రహ్మణ్యపురంలోని గుడి పూజారి మాట్లాడుతూ "మేమంతా ఆ భగవంతుడినే సెర్చ్ చేస్తాం.. నువ్వేమో ఆ భగవంతుడి మీదే రీసెర్చ్ చేస్తున్నావు" అంటాడు. ట్రైలర్ ఎండ్ లో సుమంత్ "వీటి వెనక దేవుడున్నా సరే.. నా కళ్ళతో చూసే వరకూ నా చేతులతో పట్టుకునే వరకూ ఈ ఊరొదిలే ప్రసక్తే లేదు" అంటాడు.
సుబ్రహ్మణ్యపురంలో ఏం జరుగుతోంది? ఆగుడికి ఈ అంతుచిక్కని సంఘటనలకు ఏంటి సంబంధం? ఏంటా రహస్యం? ఈ విషయాలను స్పృశిస్తూ ట్రైలర్ మొత్తం సాగింది. సినియర్ యాక్టర్లు సురేష్.. సాయి కుమార్.. హీరోయిన్ ఈషా రెబ్బా మంచి తారగాణమే ఉంది. నిఖిల్ నటించిన 'కార్తికేయ' షేడ్స్ లో సాగుతూ సినిమాపై ఇంట్రెస్ట్ క్రియేట్ చేసింది ట్రైలర్. బ్యాక్ గ్రౌండ్ స్కోర్.. సినిమాటోగ్రఫీ... అన్నీ సూపర్ గా ఉన్నాయి. ఓవరాల్ గా చూస్తే సుమంత్ ఓ స్ట్రాంగ్ ఫిలిం తో ప్రేక్షకుల ముందుకువస్తున్నట్టుగా ఉంది. ఇంకా లేట్ ఎందుకు.. వాచ్ ది ట్రైలర్..