Begin typing your search above and press return to search.
నాలుగు రోజుల్లో బడ్జెట్ రికవరీ
By: Tupaki Desk | 29 Sep 2015 1:30 PM GMTమెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ స్టార్ కేటగిరికీ చేరిపోయినట్లే ఉన్నాడు. అతడి కొత్త సినిమా ‘సుబ్రమణ్యం ఫర్ సేల్’ కేవలం నాలుగు రోజుల్లోనే బడ్జెట్ రికవర్ చేసేసింది. నాలుగు రోజుల ఫస్ట్ వీకెండ్ లో ఈ సినిమా రూ.11.08 కోట్ల షేర్ వసూలు చేయడం విశేషం. ఈ మూవీ బడ్జెట్ రూ.10 కోట్లేనని సమాచారం. ఫస్ట్ వీకెండ్ లోనే బడ్జెట్ రికవర్ చేయడమంటే సాయిధరమ్ బాక్సాఫీస్ స్టామినా ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఐతే ఇందులో డైరెక్టర్ హరీష్ శంకర్ పాత్ర కూడా కీలకమనుకోండి. మీడియం బడ్జెట్ లో సినిమా తీసి సూపర్ హిట్ రేంజికి తీసుకొచ్చిన ఘనత అతడిదే.
సుబ్రమణ్యం ఫర్ సేల్ ఫస్ట్ వీకెండ్ గ్రాస్ కలెక్షన్లు రూ.17.76 కోట్లు కావడం విశేషం. నైజాంలో ఆ సినిమా నాలుగు రోజుల్లోనే రూ.3.4 కోట్లకు కలెక్ట్ చేసింది. రాయలసీమలో రూ.1.85 కోట్లు వసూలైంది. ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాల్లో కలిపి రూ.98 లక్షలు - గుంటూరులో రూ.94 లక్షలు - తూర్పు గోదావరిలో రూ.92 లక్షలు - పశ్చిమ గోదావరిలో రూ.64 లక్షలు - కృష్ణాలో రూ.64 లక్షలు - నెల్లూరులో రూ.39 లక్షలు - కర్ణాటకలో రూ.85 లక్షలు వసూలయ్యాయి. ఐతే యుఎస్ లో మాత్రం సుబ్రమణ్యం ఫర్ సేల్ నిరాశ పరిచింది. అక్కడ రూ.45 లక్షలే వచ్చాయి. మామూలుగా తెలుగు సినిమాలకు కర్ణాటకలో కంటే యుఎస్ లోనే ఎక్కువ కలెక్షన్లు వస్తున్నాయి ఈ మధ్య.