Begin typing your search above and press return to search.

మెగా మేనల్లుడి నెత్తిన భారం పెద్దదే..

By:  Tupaki Desk   |   24 Sep 2015 4:34 AM GMT
మెగా మేనల్లుడి నెత్తిన భారం పెద్దదే..
X
హరీష్ శంకర్ చివరి సినిమా ‘రామయ్యా వస్తావయ్యా’ పెద్ద డిజాస్టర్. సాయిధరమ్ ‘రేయ్’ సంగతీ అంతే. ఐతే ఆ ప్రభావమేమీ వీళ్లిద్దరి కాంబినేషన్లో తెరకెక్కిన ‘సుబ్రమణ్యం ఫర్ సేల్’ మీద పడలేదు. ఓ స్టార్ హీరో సినిమాకు వచ్చినంత క్రేజ్ వచ్చింది ఈ సినిమాకు. బిజినెస్ కూడా ఊహించని స్థాయిలో జరిగింది. సాధారణంగా ఓ హీరో మార్కెట్‌ను అతడి కెరీర్లో చివరి పెద్ద హిట్టు ఏదో దాన్ని బట్టి నిర్ణయిస్తారు. బిజినెస్ దాని ప్రకారమే జరుగుతుంటుంది. ఐతే సాయిధరమ్ హిట్టు సినిమా ‘పిల్లా నువ్వు లేని జీవితం’ రూ.12 కోట్ల దాకా కలెక్ట్ చేసింది. కానీ ‘సుబ్రమణ్యం ఫర్ సేల్’ థియేట్రికల్ బిజినెస్ రూ.19 కోట్లని అంచనా.

నైజాం ఏరియాలో ప్రొడ్యూసర్ దిల్ రాజే సొంతంగా ఈ సినిమాను విడుదల చేస్తున్నాడు. ఐతే బయటి వాళ్లకైతే రూ.5.5 కోట్లకు హక్కులిచ్చేవారని అంచనా వేస్తున్నారు. వైజాగ్ లోనూ సొంత విడుదలే. దాని వాల్యూ రూ.1.75 కోట్లని అంచనా. మొత్తం ఆంధ్రా ఏరియాకు థియేట్రికల్ బిజినెస్ వాల్యూ రూ. 7.35 కోట్లని తేలింది. సీడెడ్ లో రూ.3 కోట్లక రైట్స్ అమ్మారు. కర్ణాటకకు రూ.1.5 కోట్లకు, ఓవర్సీస్ కు రూ.1.1 కోట్లు తీసుకున్నాడు రాజు. మొత్తం లెక్క రూ.19 కోట్ల దాకా తేలింది. దీనికి ప్రింట్లు, పబ్లిసిటీ ఖర్చులు కూడా కలుస్తాయి కాబట్టి.. ‘సుబ్రమణ్యం ఫర్ సేల్’ రూ.20 కోట్ల షేర్ కలెక్ట్ చేస్తే హిట్ అనిపించుకుంటుందన్నమాట. కాబట్టి మెగా కుర్రాడు పెద్ద భారమే మోస్తున్నట్లే.