Begin typing your search above and press return to search.
సుబ్రమణ్యం ఫర్ సేల్ రివ్యూ
By: Tupaki Desk | 24 Sep 2015 8:10 AM GMTచిత్రం - సుబ్రమణ్యం ఫర్ సేల్
నటీనటులు- సాయిధరమ్ తేజ్ - రెజీనా - ఆదా శర్మ - బ్రహ్మానందం - నాగబాబు - రావు రమేష్ - అజయ్ - నరేష్ - ఝాన్సీ - రణధీర్ - తేజస్వి తదితరులు
ఛాయాగ్రహణం- సి.రామ్ ప్రసాద్
సంగీతం- మిక్కీ జే మేయర్
నిర్మాత- దిల్ రాజు
కథ - మాటలు - దర్శకత్వం- హరీష్ శంకర్
‘గబ్బర్ సింగ్’తో ఆకాశమంత ఎత్తుకు ఎదిగి.. ‘రామయ్యా వస్తావయ్యా’తో పాతాళానికి పడ్డాడు డైరెక్టర్ హరీష్ శంకర్. మళ్లీ లేచి నిలబడే ప్రయత్నంలో మెగాస్టార్ మేనల్లుడు సాయిధరమ్ తేజ్ తో ‘సుబ్రమణ్యం ఫర్ సేల్’ తీశాడు. టైటిల్ దగ్గర్నుంచి ట్రైలర్ వరకు అన్నీ ఆకర్షణీయంగా కనిపించడంతో ఈ సినిమాపై మంచి అంచనాలే ఏర్పడ్డాయి. మరి సుబ్రమణ్యం ఏమేరకు ఆకట్టుకున్నాడో చూద్దాం పదండి.
కథ:
సుబ్రమణ్యం (సాయిధరమ్ తేజ్) కాసుల కోసం ఏ పనికైనా రెడీ అనే రకం. తనను ఏమాత్రం అభిమానించని సవతి తల్లి - చెల్లి కోసం అమెరికాలో కష్టపడుతుంటాడు. తను ప్రేమించిన వాడి కోసం ఇంట్లో చూసిన సంబంధం వద్దనుకుని అమెరికా వచ్చేసిన సీత (రెజీనా) అతడికి పరిచయమవుతుంది. సీత ప్రేమించిన వాడు మోసం చేయడంతో ఆమెను సుబ్రమణ్యమే ఆదరిస్తాడు. కొన్నాళ్ల తర్వాత ఇద్దరూ కలిసి ఇండియాకు బయల్దేరతారు. సీతను దిగబెట్టడానికి ఆమె ఇంటికి వెళ్లిన సుబ్రమణ్యం అక్కడ తప్పనిసరి పరిస్థితుల్లో ఆమెకు భర్తగా నటించాల్సి వస్తుంది. మరి ఈ నాటకం ఎన్నాళ్లు కొనసాగింది.. సుబ్రమణ్యం - సీత తమ సమస్యల్ని పరిష్కరించుకుని ఎలా దగ్గరయ్యారు.. అన్నది మిగతా కథ.
కథనం - విశ్లేషణ:
హరీష్ శంకర్ తొలి సినిమా ‘షాక్’ దగ్గర్నుంచి.. మొన్నటి రామయ్యా వస్తావయ్యా వరకు గమనిస్తే అతనెప్పుడూ కొత్త కథల జోలికి పోలేదు. పాత కథల్నే రీసైకిల్ చేసి సినిమాలు తీశాడు. ఈ ప్రయత్నంలో కొన్నిసార్లు సక్సెస్ అయ్యాడు. కొన్నిసార్లు ఫెయిలయ్యాడు. ఈసారి కూడా అతను తన దారిలోనే నడిచాడు. పైగా తాను తీసిన సినిమా మొగుడుకావాలి - బావగారు బాగున్నారా తరహా కథతోనే అని ముందే చెప్పేసి.. తెలిసిన కథే చూడ్డానికి ముందే జనాల్ని మరింతగా ప్రిపేర్ చేసేశాడు.
ఐతే ఇలా ప్రిపేర్ చేసినంత మాత్రాన సేఫ్ అనుకోవడానికేమీ లేదు. కథ కొత్తదైనా - పాతదైనా రెండున్నర గంటలు కూర్చోబెట్టడం సవాలే. ఓ మోస్తరు వినోదంతో ఆ సవాలును ఛేదించే ప్రయత్నం చేశాడు హరీష్. ట్రైలర్ చూసి 'సుబ్రమణ్యం ఫర్ సేల్’ మీద ఏ అంచనాలతో అయితే వస్తారో ఆ విషయంలో హరీష్ అండ్ కో నిరాశ పరచలేదు. భారీ అంచనాలేమీ పెట్టుకోకుండా కాలక్షేపం చేయడానికైతే సుబ్రమణ్యం కంపెనీ తీసుకోవచ్చు.
ప్రథమార్ధంలో హీరో హీరోయిన్ల గిల్లికజ్జాలు.. ద్వితీయార్ధంలో ఫ్యామిలీ సెటప్ లో ఎంటర్ టైన్ మెంట్.. ఇలా రొటీన్ సినిమానే ట్రై చేశాడు హరీష్ శంకర్. ఐతే ‘రామయ్యా వస్తావయ్యా’ ఫుల్ ఎఫర్ట్ ఫస్టాఫ్ మీద పెట్టి, ద్వితీయార్ధాన్ని గాలికొదిలేసిన హరీష్.. ఈసారి ఆ తప్పు చేయలేదు. ప్రథమార్ధాన్ని సోసోగా నడిపించేసి.. ఫోకస్ మొత్తం సెకండాఫ్ మీద పెట్టాడు.
ప్రథమార్ధంలో అమెరికా నేపథ్యంలో సాగే వ్యవహారమంతా మామూలుగా అనిపిస్తుంది. హీరోయిన్ వేరే అబ్బాయి కోసం రావడం.. అతడు మోసం చేయడం.. హీరో ఆమెను ఆదరించడం.. ఇదంతా చాలా చాలా రొటీన్ గా సాగిపోతుంది. బ్రహ్మానందం కామెడీ కూడా పెద్దగా వర్కవుట్ కాకపోవడంతో సుబ్రమణ్యంతో ప్రయాణం కష్టంగానే అనిపిస్తుంది. ఇంటర్వెల్ తర్వాత హీరోను హీరోయిన్ ఇంటికి చేరగానే.. ఇక అక్కడ ఒక్కొక్కర్ని టార్గెట్ చేసి.. వాళ్ల మనసులు గెలిచే రొటీన్ వ్యవహారంతో కథ నడుస్తుందేమో అని కంగారు పుడుతుంది కానీ.. హరీష్ కొంచెం భిన్నమైన దారిలో నడిచాడు. అది పెద్ద రిలీఫ్.
ద్వితీయార్ధంలో తొలి గంట ‘సుబ్రమణ్యం ఫర్ సేల్’కు బలం. హరీష్ శంకర్ చమత్కారం, వెటకారం అంతా ఈ గంటలోనే కనిపిస్తుంది. స్క్రీన్ ప్లే రేసీగా ఉండటం.. హరీష్ పెన్ను మంచి పంచ్ లు విదల్చడంతో కథనం చకచకగా ముందుకు సాగుతుంది. కథ ఎటు పోతోందో ఆలోచించనివ్వకుండా.. ప్రేక్షకుడిని ఎంటర్ టైన్ మెంట్ మాయలో పడేసి చకచకా క్లైమాక్స్ వరకు లాక్కెళ్లిపోతాడు దర్శకుడు. సాయిధరమ్-రెజీనాల కెమిస్ట్రీ సెకండాఫ్ కు ఆకర్షణగా నిలిచింది. రావు రమేష్.. ఫిష్ వెంకట్ ల కాంబినేషన్ లో సాయిధరమ్ కామెడీ కూడా బాగా పండించాడు. బ్రహ్మి కూడా ఓ మోస్తరుగా నవ్వించాడు. ఐతే ప్రి క్లైమాక్స్ వరకు బాగా సాగిన కథనం.. చివరి పావు గంటలో గాడి తప్పింది. క్లైమాక్స్ లో ఫైట్ లేకుండా ఎమోషన్ మీద నడిపించాలనుకోవడం ఓకే కానీ.. ఆ సన్నివేశాలు అనుకున్నట్లు పండలేదు. లెంగ్త్ ఎక్కువైంది. హీరోని సవతి తల్లితో కలపడం కోసం మరీ డ్రమటిక్ గా ఉండే సన్నివేశం పెట్టి సినిమా మీదున్న ఫీల్ చెడగొట్టాడు హరీష్.
నటీనటులు:
సాయిధరమ్ ది అంత ఛార్మింగ్ ఫేసేమీ కాదు. కానీ అతడి ఎనర్జీ - ఉత్సాహం అతడి మైనస్ లను కవర్ చేసి హీరో క్యారెక్టర్ తో ప్రేక్షకులు కనెక్టయ్యేలా చేస్తాయి. చిరంజీవి - పవన్ కళ్యాణ్ లను అనుకరిస్తూ మెగా అభిమానుల్ని సాయి ఉర్రూతలూగించాడు. సెకండాఫ్ లో పైజామాతో కనిపించే ఓ ఇరవై నిమిషాలు సాయిధరమ్ చెలరేగిపోయాడు. ఐతే సెంటిమెంటు సన్నివేశాల్లో సాయిధరమ్ చాలా మెరుగవ్వాలని క్లైమాక్స్ చూస్తే అర్థమైపోతుంది. సాయి వాయిస్ బాగుంది కానీ.. డైలాగ్ డెలివరీ కూడా మెరుగు పడాలి. డ్యాన్సుల్లో సాయి అదరగొట్టాడు. టాలీవుడ్ లో మోస్ట్ స్టైలిష్ డ్యాన్సర్ లలో పేరు తెచ్చుకునే టాలెంట్ అతడికుంది. రెజీనా మరోసారి తన ప్రతిభ చాటుకుంది. సాయిధరమ్ తో ఆమె కెమిస్ట్రీ పండింది. ఇన్నాళ్లూ నటనతోనే ఆకట్టుకున్న రెజీనా.. ఈ సినిమాతో గ్లామర్ విందు కూడా చేసింది. రావు రమేష్ ఓ టిపికల్ స్టయిల్ లో తన ప్రత్యేకత చాటుకున్నాడు. అతడి క్యారెక్టర్ని హరీష్ బాగా డిజైన్ చేశాడు. బ్రహ్మానందం క్యారెక్టర్ మరీ పేలిపోలేదు కానీ.. అలాగని తీసిపారేసేలా లేదు. ద్వితీయార్ధంలో బ్రహ్మి కూడా ఓ హ్యాండ్ వేశాడు. ఆదా శర్మ ‘సన్నాఫ్ సత్యమూర్తి’ తరహాలోనే ప్రాధాన్యం లేని క్యారెక్టర్ చేసింది. నాగబాబు - సుమన్ - అజయ్ - నరేష్ పాత్రలకు తగ్గట్లు నటించారు.
సాంకేతిక వర్గం:
మిక్కీ జే మేయర్ తన స్టయిల్ కు భిన్నమైన మ్యూజిక్ ఇచ్చాడు. మిక్కీ మార్కు మెలోడీలు లేకపోయినా.. పాటలు బాగానే వున్నాయి. సినిమాకు తగ్గ ఊపున్న పాటలిచ్చాడతను. సాంగ్స్ అన్నీ కథనంలో ఇమిడిపోయాయి. బ్యాగ్రౌండ్ స్కోర్ కూడా ఓకే. రామ్ ప్రసాద్ ఛాయాగ్రహణం కలర్ ఫుల్ గా ఉంది. దిల్ రాజు సినిమా.. నిర్మాణ విలువల గురించి చెప్పాల్సిన పని లేదు. ఐతే హరీష్ అన్నట్లు సినిమాకు అమెరికా బ్యాగ్రౌండ్ అవసరమా అంటే.. లేదనే చెప్పాలి. ముగ్గురు రచయితలు కలిపి అందించిన స్క్రీన్ ప్లే ప్రథమార్ధంలో కొంచెం ఎగుడుదిగుడుగా సాగింది కానీ.. ద్వితీయార్ధంలో రేసీగా సాగింది. హరీష్ డైరెక్టరుగా గబ్బర్ సింగ్ - మిరపకాయ్ స్థాయి పనితనం చూపించలేదు కానీ.. మళ్లీ ఫామ్ అందుకునే ప్రయత్నమైతే చేశాడు. హరీష్ మార్కు మాటలు సినిమాలో చాలానే ఉన్నాయి. పంచ్ లు చాలాచోట్ల పేలాయి.
చివరగా: పైసా వసూల్.. సుబ్రమణ్యం!
రేటింగ్: 3/5
#Subramanyamforsale, #Subramanyamforsalemovie, #subramanyamforsalereview, #subramanyamforsalerating, #subramanyamforsaletalk, #Saidharamtej, #Regina, #Saidharamtejsubramanyamforsale
Disclaimer : This Review is an Opinion of Review Writer. Please Do not Judge the Movie based on This Review and Watch Movie in Theatre