Begin typing your search above and press return to search.
మెగా మేనల్లుడా మజాకా!!
By: Tupaki Desk | 31 Aug 2015 11:42 AM GMTఏడాది కిందట సాయిధరమ్ తేజ్ పరిస్థితేంటో ఓసారి ఊహించుకోండి. అప్పటికి అతడి తొలి సినిమా ‘రేయ్’ సంగతేంటో తేలలేదు. రెండో సినిమా ‘పిల్లా నువ్వు లేని జీవితం’ రిలీజ్ కాలేదు. అతడి కెరీర్ అయోమయంలో ఉంది. కానీ ఏడాది తిరిగేసరికి చూడండి. చేతిలో మూణ్నాలుగు సినిమాలతో ఫుల్ బిజీ. దిల్ రాజు అతణ్ని వదలట్లేదు. అతడి కొత్త సినిమా ‘సుబ్రమణ్యం ఫర్ సేల్’ మీద నెలకొన్న క్రేజ్ చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే. దిల్ రాజు ఇప్పటికే టేబుల్ ప్రాఫిట్స్ తో ఉన్నాడు. బిజినెస్ ఓ రేంజిలో జరిగింది. తాజాగా ఈ సినిమా శాటిలైట్ రైట్స్ రేట్ విషయం బయటికి వచ్చింది. ఆ ఫిగర్ చూస్తే దిమ్మదిరగడం ఖాయం. మాటీవీ రూ.4 కోట్లు పెట్టి ఈ సినిమా శాటిలైట్ రైట్స్ తీసుకుంది. ఈ రేటు చూస్తే సాయిధరమ్ స్టార్ హీరోల సరసన చేరడానికి చాలా చేరువగా ఉన్నాడని అర్థమైపోతుంది.
ఈ మధ్య స్టార్ హీరోల సినిమాలకే రిలీజ్ ముందు శాటిలైట్ కావడం కష్టమైపోతోంది. అలాంటిది ‘సుబ్రమణ్యం ఫర్ సేల్’ మంచి రేటుతో అమ్ముడైపోవడం విశేషమే. ‘పిల్లా నువ్వు లేని జీవితం’ సినిమాకు మంచి రేటింగ్స్ రావడం.. సుబ్రమణ్యం ఫర్ సేల్ మీద ఉన్న హైప్ చూసి.. మాటీవీ ఫ్యాన్సీ రేటిచ్చి ఈ సినిమాను కొన్నట్లు తెలుస్తోంది. సెప్టెంబరు 24న ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తెస్తున్నారు. సాయితో ‘పిల్లా నువ్వు లేని జీవితం’ చేసిన రెజీనానే ఇందులోనూ కథానాయిగా నటించింది. గబ్బర్ సింగ్ ఫేమ్ హరీష్ శంకర్ దర్శకత్వం వహించాడు. మిక్కీ జే మేయర్ సంగీత దర్శకుడు. ఇటీవలే విడుదలైన ఆడియో ఆకట్టుకుంది. ట్రైలర్ కూడా ఆసక్తి రేపడంతో సినిమా మీద అంచనాలు బాగానే ఉన్నాయి.