Begin typing your search above and press return to search.
ఓవర్సీస్ లో సుబ్రమణ్యం పప్పులుడకలే
By: Tupaki Desk | 29 Sep 2015 9:30 AM GMTసాయిధరమ్ తేజ్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వం వహించిన సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ ఓవర్సీస్ రిపోర్ట్ ఏంటి? దీనికి పక్కా సమాచారం బైటికొచ్చింది. సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ సినిమా యావరేజ్ అంటూ ప్రారంభం సమీక్షలు వచ్చాయి. అయితే ఈ సినిమా ఏపీ - తెలంగాణలోని బి -సి కేంద్రాల్లో బాగానే ఆడుతోందని ప్రచారం సాగించారు. ఒకవేళ అది నిజమే అయినా .. ఓవర్సీస్ లో మాత్రం సుబ్రమణ్యం పప్పులేవీ ఉడకలేదని పక్కాగా చెబుతున్నారు. సాయిధరమ్ సినిమాని ఎన్నారైలు పెద్దగా ఆదరించలేదు. దాని ఫలితం ఇప్పటికి కేవలం 85లక్షలు మాత్రమే విదేశీ బాక్సాఫీస్ నుంచి వసూలైంది.
ఇటీవలి కాలంలో నాని హీరోగా నటించిన భలే భలే మగాడివోయ్ చిత్రంతో పోలిస్తే ఇది పది రెట్టు తక్కువ. నాని హీరోగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన బిబిఎం కేవలం అమెరికా బాక్సాఫీస్ వద్ద సుమారు 10కోట్లు వసూలు చేసింది. ఆ రకంగా సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ విదేశాల్లో అట్టర్ ఫ్లాపైందని రిపోర్టులు చెబుతున్నాయి. ఓవర్సీస్ పంపిణీదారులకు ఈ సినిమా నష్టాల్నే మిగిల్చిందని అంటున్నారు. అధికారిక లెక్కల ప్రకారం డాలర్లలో ఈ రెండు సినిమాల్ని కంపార్ చేస్తే.. సుబ్రమణ్యం ఫర్ సేల్ రిలీజ్ తర్వాత ఇప్పటికి 1 లక్ష 28వేల 394 డాలర్లు వసూలు చేసింది. భలే భలే మగాడివోయ్ ఇప్పటికి 14 లక్షల 12 వేల 819 డాలర్లు వసూలు చేసింది. తేడా స్పష్టంగా అర్థమైందా?