Begin typing your search above and press return to search.
సక్సెస్ మీనింగ్ మారుస్తున్న టాలీవుడ్
By: Tupaki Desk | 18 May 2019 4:13 AM GMTఒకప్పుడు తెలుగు సినిమా విజయానికి కొలమానం ఎన్ని రోజులు ఆడిందనే దాన్ని బట్టి డిసైడ్ చేసేవారు. కనీసం యాభై రోజులు హౌస్ ఫుల్ అయితే తప్ప సూపర్ హిట్ అనలేని పరిస్థితి. ఇండస్ట్రీ హిట్ అంటే ఏడాది ఆడాల్సిందే. ఇప్పుడు ట్రెండ్ మారింది. ఓపెనింగ్స్ ని పరమావధిగా పెట్టుకుని పెట్టుబడికి ఎంతో కొంత లాభాలు వస్తే చాలు అనుకునే పరిస్థితి నెలకొంది.
అర్ధశతదినోత్సం దేవుడెరుగు ఓ నెల రోజులు థియేటర్ లో ఉంటే చాలు అదే ఘనతగా భావించే పరిస్థితి. అలా అని అందరికి ఇదే వర్తిస్తుందని కాదు. కంటెంట్ ఉంటే లాంగ్ రన్ సాధ్యమే అని రంగస్థలం-మహానటి-గీత గోవిందం-ఎఫ్2 లాంటి సినిమాలు వసూళ్ల సాక్షిగా నిరూపించాయి. కానీ గత కొంత కాలంగా సక్సెస్ కి మీనింగ్ మారిపోతోంది
మొదటి రోజు తొలి రెండు ఆటలు హౌస్ ఫుల్ అని తెలియడం ఆలస్యం సాయంత్రానికి ప్రెస్ మీట్ పెట్టడం సినిమా ఆఫీస్ ముందు బాణాసంచా కాల్చి సదరు హీరోల కెరీర్లో బెస్ట్ ఓపెనింగ్ వచ్చింది కాబట్టి మాది బ్లాక్ బస్టర్ అని చెప్పుకోవడం సర్వ సాధారణం అయిపోయింది. పట్టుమని వారం తిరక్కుండానే లెక్కబెట్టుకోవడానికి అలిసిపోయే రేంజ్ లో సక్సెస్ మీట్లు అవుట్ డోర్ విజిట్లు ఒకటా రెండా ఎన్నో ఎన్నెన్నో.
కనీసం పది రోజులు అయ్యాక బాక్స్ ఆఫీస్ స్టేటస్ చూసి అప్పుడు హిట్టో ఫట్టో చెప్పుకునే రోజులు కావివి. ఫస్ట్ డే హాళ్లు నిండటం కామన్ అనే లాజిక్ ని పక్కన పెట్టి మరీ మాది అదిరిపోయే హిట్ అని చెప్పుకోవడం అభద్రతా భావాన్ని సూచిస్తోంది. ఇది ఏ ఒక్క సినిమాకో పరిమితమయ్యింది కాదు. ఫలితంతో సంబంధం లేకుండా అందరు హీరోలు దర్శక నిర్మాతలు చేస్తున్నదే. చూస్తుంటే భవిష్యత్తులో ఉదయం బెనిఫిట్ షో కాగానే విజయోత్సవ సంబరాలు చేసేలా ఉన్నారు. ఏమో మనం సరదాగా అనుకున్నా ఇదే నిజమైనా ఆశ్చర్యం లేదు