Begin typing your search above and press return to search.
సల్మాన్ తర్వాత అనుష్క బాడీ గార్డ్ కే అంత ప్యాకేజీ!
By: Tupaki Desk | 19 July 2021 5:17 AM GMTబాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ తన బాడీగార్డ్ షెరాకు నెలకు 15లక్షల జీతం చెల్లిస్తున్న సంగతి తెలిసిందే. షెరా వార్షికాదాయం సుమారు 2కోట్లు. సినీ వరల్డ్ లో ఇంత భారీ ప్యాకేజీ అందుకునే వేరొక బాడీగార్డ్ లేనేలేరు. ఒక కంపెనీ సీఈవో అందుకుంటున్నంత గొప్ప ప్యాకేజీని సల్మాన్ బాడీగార్డ్ అందుకోవడం ఒక సంచలనం.
కేవలం సల్మాన్ కి మాత్రమేనా...? .. ది గ్రేట్ బాలీవుడ్ హీరోయిన్.. టీమిండియా రధసారథి విరాట్ సతీమణి అనుష్క శర్మ బాడీగార్డ్ ప్రకాష్ సింగ్ అలియాస్ సోను సైతం ఇంచుమించు సల్మాన్ ఖాన్ బాడీగార్డ్ తరవాత అంతే భారీగా ప్యాకేజీ అందుకుంటూ రికార్డులు బ్రేక్ చేస్తున్నాడు. అనుష్క శర్మ తన బాడీగార్డ్ కి ఏడాదికి 1.2 కోట్ల మేర ముట్టజెబుతోందట. కథానాయికల్లో వ్యక్తిగత సెక్యూరిటీకి అత్యధిక చెల్లింపు ఇదే. అనుష్క శర్మ - విరాట్ కోహ్లీ జంట నగరంలో షికార్లు చేసేప్పుడు లేదా విదేశాలకు వెళ్ళిన ప్రతిసారీ సెక్యూరిటీ బృందం ప్రతిదీ అదుపులో ఉండేలా చూస్తారు.
దేశంలో మోస్ట్ పవర్ ఫుల్ కపుల్ గా పాపులరైన ఆ ఇద్దరికీ భారీగా అభిమానులు ఉన్నారు. అభిమానులు వారితో ఫోటోలు సెల్ఫీల కోసం ఎగబడతారు. అలాంటి సమయంలో ఎలాంటి గందరగోళం తలెత్తకుండా అనుష్క వ్యక్తిగత బాడీగార్డ్ సోను ఆమెకు విరాట్ కోహ్లీకి ఒక సైనికుడిలా పని చేస్తారు. అతను కెరీర్ ఆద్యంతం అనుష్క శర్మకు సెక్యూరిటీగా ఉన్నారు. విరాట్ ను అనుష్క వివాహం చేసుకోకముందే అతను ఆమెకు గార్డ్.
ప్రకాష్ సింగ్ అలియాస్ సోనుకు అనుష్క భారీ మొత్తంలో జీతం చెల్లిస్తున్నారు. ప్రముఖ బాలీవుడ్ మీడియా నివేదిక ప్రకారం సోను వార్షిక వేతనం రూ. సుమారు 1.2 కోట్లు. అతను ముంబైలో అత్యధికంగా పారితోషికం అందుకునే సెలబ్రిటీ బాడీగార్డ్ లలో ఒకడు అని కథనం వెల్లడించింది. అనుష్క తన బాడీగార్డ్ ను తన కుటుంబ సభ్యుడిగా భావించి గౌరవిస్తారు. అతడు కూడా ఆ కుటుంబంతో అంతే ఇదిగా కలిసిపోయి పని చేస్తారు.