Begin typing your search above and press return to search.

‘సుచి లీక్స్’ ఎపిసోడ్ లో మరో షాకింగ్ పరిణామం

By:  Tupaki Desk   |   5 March 2017 5:50 AM GMT
‘సుచి లీక్స్’ ఎపిసోడ్ లో మరో షాకింగ్ పరిణామం
X
వికిలీక్స్ గురించి విన్నాం. దాని రచ్చ ఎంతో చూశాం. కానీ.. ఈ సుచి లీక్స్ ఏంది? కొత్తగా ఉందే అనుకుంటున్నారా? నిజమే.. సుచిలీక్స్ అన్నది కొత్తదే.కానీ.. కోలీవుడ్ మొత్తాన్ని.. టాలీవుడ్ లో కొంత మేర ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. సింగర్ సుచిత్ర తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా పోస్ట్ చేస్తున్న తారల ప్రైవేటు ఫోటోలు.. వీడియోలు రేపుతున్న దుమారం అంతా ఇంతా కాదు. అయితే.. ఈ ఫోటోలతో తన భార్యకు ఏ మాత్రం సంబంధం లేదని.. ఆమె ట్విట్టర్ ఖాతాను ఎవరో హ్యాక్ చేశారంటూ సుచిత్ర భర్త కార్తీక్ కుమార్ పేర్కొన్నారు.

చిత్రమైన విషయం ఏమిటంటే.. అకౌంట్ హ్యాక్ అయ్యిందన్న తర్వాత కూడా.. ఆమె అకౌంట్ నుంచి పలువురు ప్రముఖ తారల ప్రైవేటు చిత్రాలు పోస్ట్ కావటం.. కొందరు నటీమణుల నగ్న చిత్రాలు బయటకు రావటం సంచలనంగా మారింది. ఒక పార్టీలో హీరో ధనుష్ తనతో తప్పుగా ప్రవర్తించాడని.. కూల్ డ్రింక్ లో మద్యం కలిపి ఇచ్చి.. తన పట్ల దారణంగా ప్రవర్తించినట్లుగా పేర్కొంది. ఇదో సంచలనంగా మారింది. అయితే.. తన భార్య ట్విట్టర్ ఖాతాను ఎవరో హ్యాక్ చేస్తున్నారంటూ హీరో ధనుష్ కు సారీ చెప్పారు.

ఇదంతా జరిగిన తర్వాత..సుచిత్ర అకౌంట్ నుంచి సంగీత దర్శకుడు అనిరుద్ - హీరోయిన్ ఆండ్రియా.. హీరో రానా – హీరోయిన్ త్రిష.. టీవీ నటిదివ్యదర్శిని ఒక యువకునితో క్లోజ్ గా ఉన్న ఫోటోలు సుచిత్ర ట్విట్టర్ లో పోస్ట్ అయ్యాయి. ఈ ఫోటోలతో వారి రాసలీలలు అన్న ట్యాగ్ లైన్ తో పాటు.. వేరే వారికి సంబంధించిన వీడియోలు పోస్ట్ చేయటం.. త్వరలో మరికొందరి తారల రాసలీలల్ని బయటపెట్టనున్న సందేశాన్ని పేర్కొనటంతో ఈ వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది.

నిన్నటి వరకూ తన భార్య ట్విట్టర్ ఖాతా హ్యాక్ అయ్యిందని.. తమ పరిస్థితిని అర్థం చేసుకోవాలన్న సుచిత్ర భర్త కమ్ నటుడు కార్తీక్ కుమార్ తాజాగా తన భార్య మానసిక పరిస్థితి ఏ మాత్రం బాగోలేదన్న వ్యాఖ్య చేయటం దుమారం రేపుతోంది. ఈ పరిణామాల నేపథ్యంలో సుచిత్ర ట్విట్టర్ అకౌంట్ లో ఎప్పుడేం పోస్ట్ అవుతుందన్నది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది. మరోవైపు.. ఈ వ్యవహారంపై పోలీసులు దృష్టి సారించారు. నిజంగానే సుచిత్ర ట్విట్టర్ ఖాతా హ్యాక్ అయ్యిందా? లేదా? అన్నది తేలాల్సి ఉంది. ఇంతకూ.. సుచిత్ర ట్విట్టర్ ఖాతా హ్యాక్ అయ్యిందా? లేక.. సుచిత్ర మానసిక పరిస్థితి బాగా లేదా? అన్నది మిలియన్ డార్ల ప్రశ్నగా మారింది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/