Begin typing your search above and press return to search.

తనపై వస్తున్న వార్తలపై స్పందించిన సుద్దాల అశోక్ తేజ...!

By:  Tupaki Desk   |   9 July 2020 3:45 AM GMT
తనపై వస్తున్న వార్తలపై స్పందించిన సుద్దాల అశోక్ తేజ...!
X
ప్రముఖ గేయ రచయిత సుద్దాల అశోక్ తేజ గత కొంతకాలంగా కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతుండగా.. కొన్ని రోజుల క్రితం అశోక్ తేజకి లివ‌ర్ ట్రాన్స్‌ ప్లాంటేష‌న్ జ‌రిగింది. అయితే ఇప్పుడు రచయిత సుద్దాల అశోక్ తేజ‌కు ఆరోగ్యం మరోసారి విషమించిందని సోష‌ల్ మీడియాలో న్యూస్ స్ప్రెడ్ అయింది. ఈ నేపథ్యంలో సుద్దాల అశోక్ తేజ ఈ రూమర్స్ పై స్పందిస్తూ ఓ వీడియో రిలీజ్ చేశారు. తన ఆరోగ్యం విషమించింది అనే వార్తలను ఖండించారు. ఈ వార్త‌ల్లో ఎలాంటి నిజం లేదని.. నేను క్షేమంగా ఉన్నారని పేరొన్నారు.

సుద్దాల అశోక్ తేజ మాట్లాడుతూ.. ''మిత్రులకు, శ్రేయోభిలాషులకు, పాటంటే ఇష్టపడే వారికి నా నమష్కారం. మీ అందరి ప్రేమ వలన.. దయ వలన.. ప్రభుత్వం యొక్క సహాయ సహకారాల వలన నేను లివ‌ర్ ట్రాన్స్‌ ప్లాంటేష‌న్ సర్జరీ జరిగిన తర్వాత మెల్లమెల్లగా రోజురోజుకి నేను కోలుకుంటున్నాను. మళ్ళీ పాటలు రాస్తున్నాను. నేను చాలా ఆరోగ్యంగా సంతోషంగా ఉన్నాను. కాకపోతే ఈ కరోనా ఉండటం వలన కొంచెం జాగ్రత్తగా ప్రజలందరి మాదిరిగానే ఈ రోజు ఉన్న పరిస్థితులను బట్టి జాగ్రత్తగా ఉండవలసి వస్తోందే తప్ప నా ఆరోగ్యంలో ఎలాంటి ఇబ్బంది లేదు. అయితే అశోక్ తేజ ఆరోగ్యం మళ్ళీ విషమంగా ఉందనే ఏదో న్యూస్ వచ్చిందని తెలిసింది. నేను చాలా ఆరోగ్యంగా ఉన్నానని మిత్రులందరికీ అభిమానులకు స్నేహితులకు బంధువులకు తెలియజేస్తున్నాను'' అని చెప్పుకొచ్చాడు.

కాగా సుద్దాల అశోక్ తేజ తెలుగు చిత్ర పరిశ్రమలో సాంగ్ కి నేషనల్ అవార్డ్ సొంతం చేసుకున్న అతి తక్కువ మంది రచయితల్లో ఒక‌రు. 'ఠాగూర్' సినిమాలోని 'నేను సైతం' పాట‌కు గాను ఈ ఘనత దక్కించుకున్నారు. ఆయన విప్లవ గీతాలతో క్లాసిక్ సాంగ్స్‌ కు కూడా సాహిత్యాన్ని అందించారు. 'భద్రాచలం' సినిమాలో 'ఒకటే జననం.. ఒకటే మరణం'.. 'రోబో' సినిమాలో ఇనుములో ఒక హృదయం మొలిచెనే.. 'ఫిదా' సినిమాలో 'వచ్చిండే మెల్ల మెల్లగ వచ్చిండే' వంటి సూపర్ హిట్స్ సాంగ్స్ రాసారు. ప్రస్తుతం సుద్దాల అశోక్ తేజ 'ఆర్.ఆర్.ఆర్' చిత్రంలో మూడు పాటలు రాయడం విశేషం.