Begin typing your search above and press return to search.
మాట సాయాలను మానేసిన జక్కన్న!
By: Tupaki Desk | 17 Jan 2019 7:57 AM GMTటాలీవుడ్ జక్కన్న రాజమౌళి ఒకప్పుడు తనకు నచ్చిన సినిమాలపై సోషల్ మీడియా వేదికగా తన రివ్యూను ఇచ్చేవాడు. సినిమా మొదటి రోజు చూసి తన వ్యూను చెప్పే జక్కన్న తన వారి సినిమాల విషయంలో మాత్రం ఇంకాస్త ఎక్కువగా స్పందించేవాడు. ముఖ్యంగా సాయి కొర్రపాటి నిర్మించిన ప్రతి ఒక్క సినిమాకు కూడా తన వ్యాఖ్యలను చెప్పిన దర్శకుడు రాజమౌళి ఈసారి 'ఎన్టీఆర్' సినిమాకు మాత్రం స్పందించలేదు. ఎన్టీఆర్ సినిమాపై సినీ ప్రముఖులు చాలా మంది తమదైన శైలిలో ప్రశంసలు కురిపిస్తూ మెచ్చుకుంటూ వ్యాఖ్యలు చేశారు. కాని రాజమౌళి మాత్రం తనకేం పట్టనట్లుగా ఉండి పోయాడు.
ఆమద్య 'కేజీఎఫ్' సినిమా గురించి చాలా పాజిటివ్ గా జక్కన్న మాట్లాడాడు. ఆ మాటల వల్ల కేజీఎఫ్ సినిమాకు మంచి హైప్ క్రియేట్ అయ్యింది. రాజమౌళి ఏదైనా సినిమా గురించి మాట్లాడాడు అంటే ఖచ్చితంగా అందులో మ్యాటర్ ఉంటుందని అందరి నమ్మకం. కాని గత కొన్ని రోజులుగా ఇతర సినిమాల గురించి మాత్రం స్పందించడం లేదు. ముఖ్యంగా సంక్రాంతికి వచ్చిన నాలుగు సినిమాల గురించి జక్కన్న నోటి నుండి మాట వచ్చిందే లేదు. ఎన్టీఆర్ సినిమా గురించైనా జక్కన్న స్పందిస్తాడేమో అనుకున్నారు. కాని ఎన్టీఆర్ సినిమా గురించి స్పందిస్తే ఇతర సినిమాల గురించి కూడా మాట్లాడాల్సి వస్తుందనే ఉద్దేశ్యంతో జక్కన్న సైలెంట్ అయినట్లుగా తెలుస్తోంది.
గతంలో చిన్న సినిమాలకు మాట సాయం చేసిన జక్కన్న ఇకపై చిన్న పెద్ద అనే తేడా లేకుండా ఇతర సినిమాల గురించి మాట్లాడవద్దని నిర్ణయించుకున్నాడు. అయితే అప్పుడప్పుడు ఏదైనా సినిమా ప్రమోషన్ కార్యక్రమాలకు అంటే ఆడియో వేడుకలకు లేదంటే మరేదైనా కార్యక్రమాలకు వెళ్తే వెళొచ్చు అంటున్నారు. మొత్తానికి జక్కన్న తీసుకున్న ఈ నిర్ణయం వల్ల ఇకపై సినిమాల మీద ఆయన అభిప్రాయం మనకు తెలిసే అవకాశం లేదు. తన తనయుడు నిర్మించబోతున్న సినిమా విషయంలో రాజమౌళి ఎలా స్పందిస్తాడో చూడాలి.