Begin typing your search above and press return to search.
విడాకులపై మనసుమార్చుకున్న స్టార్!
By: Tupaki Desk | 10 Jan 2017 8:06 AM GMTవిడాకులకు అప్లై చేసుకున్న వెంటనే కోర్టు వాటిని మంజూరు చేయదు.. ఆ భార్యభర్తలు క్షణికావేశంలో తీసుకున్నారా లేక నిజంగానే ఏమాత్రం కలిసి బ్రతికే అవకాశాలు లేక ఇలాంటి నిర్ణయం తీసుకున్నారా అనేది వేచి చూడటానికి సమయం ఇస్తుంది! సరిగ్గా ఆ సమయమే సుదీప్ కుటుంబంలో ఆనందాలు నింపింది! అవును... ఈగ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన ప్రముఖ కన్నడ నటుడు కిచ్చ సుదీప్ తన భార్యతో విడాకులు కావాలని కోర్టుకెక్కిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఆ విషయంలో పునరాలోచన చేసుకున్నాడో ఏమో కానీ, తిరిగి ఆమెతో కలిసి ఉండటానికి నిశ్చయించుకున్నాడు.
గతంలో సుదీప్.. తన భార్య ప్రియా రాధాకృష్ణన్ తో కలిసి ఉండలేకపోతున్నానని, తనకు విడాకులు ఇప్పించాలని కోర్టులో కేసు వేశాడు! అయితే అలా న్యాయస్థానాన్ని ఆశ్రయించినప్పటికీ ఒక్కసారి కూడా కోర్టుకు హాజరు కాలేదు. ఈ క్రమంలో తనకు ఒక రెండు నెలలు సమయం కావాలని ఇతడి తరుపు న్యాయవాది న్యాయస్థానాన్ని కోరడంతో కేసు విచారణ మార్చి 9కి వాయిదా పడింది. అయితే తాజాగా సుదీప్, ప్రియ ఇద్దరూ తమ విభేదలు మరచిపోయి కలిసుండాలని నిర్ణయం తీసుకున్నారు. దీంతో రెండు కుటుంబాల మధ్య హర్షం వ్యక్తం అవడంతోపాటు, సుదీప్ అభిమానులు కూడా సంతోషంగా ఉన్నారు!
కాగా 2001లో సుదీప్ - ప్రియ ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరిద్దరికి ఓ పాప కూడా ఉంది. అయితే వ్యక్తిగత కారణాలరీత్యా విడిపోయేందుకు వీరిద్దరూ గతంలో న్యాయస్థానం ఆశ్రయించారు. ఈ విడాకులు మజూరు అయితే తన భార్యకు పెద్ద ఎత్తున భరణం ఇవ్వడానికి కూడా అప్పట్లో సుదీప్ సిద్ధపడ్డాడు. అయితే తాజాగా వీరిద్దరు కలిసి ఉండాలని నిర్ణయం తీసుకున్నారు!
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/