Begin typing your search above and press return to search.
బిచ్చగాడు పాత్ర కోసం కొట్టుకుంటున్నారు
By: Tupaki Desk | 21 July 2016 1:30 PM GMTతమిళ హిట్ మూవీ ‘పిచ్చైకారన్’ సినిమాను తెలుగులో రీమేక్ చేద్దామంటే ఏ హీరో ముందుకు రాలేదు. రానాతో పాటు కొందరు హీరోలను ట్రై చేసి.. చివరికి ఆ చిత్రాన్ని ‘బిచ్చగాడు’ పేరుతో తెలుగులోకి అనువాదం చేసి రిలీజ్ చేశారు. ఈ సినిమా అనూహ్యమైన కలెక్షన్లు సాధిస్తూ శతదినోత్సవం దిశగా దూసుకెళ్లిపోతోంది. తమిళ-తెలుగు భాషల్లో ఈ సినిమా సాధించిన విజయం చూశాక.. మిగతా భాషల వాళ్లు ‘పిచ్చైకారన్’ రీమేక్ కోసం తహతహలాడిపోతున్నారు.
అందులోనూ రీమేక్ సినిమాలకు బాగా ఫేమస్ అయిన కన్నడ ఇండస్ట్రీ నుంచి ఓ నిర్మాత ఫ్యాన్సీ ప్రైస్ ఇచ్చి రీమేక్ రైట్స్ తీసేసుకున్నాడట. తెలుగులోనే కాదు.. అసలు తమిళంలో సైతం దర్శకుడు శశి ఈ కథతో చాలామంది హీరోల్ని కలిసినా ఎవ్వరూ ఒప్పుకోలేదు. చివరికి విజయ్ ఆంటోనీ ముందుకొచ్చాడు. కెరీర్లో బిగ్గెస్ట్ హిట్ అందుకున్నాడు. ఐతే ఇప్పుడు కన్నడలో బిచ్చగాడు పాత్ర పోషించడం కోసం హీరోలు నేనంటే నేనంటూ పోటీ పడుతున్నారట. అందులో కొందరు స్టార్లు కూడా ఉన్నారు.
ఐతే కిచ్చ సుదీప్ రేసులో ముందున్నట్లు సమాచారం. సుదీప్ ఇప్పటికే ఎన్నో తెలుగు-తమిళ రీమేకుల్లో నటించాడు. ‘పిచ్చైకారన్’ రీమేక్ తన కెరీర్లో మరో ప్రత్యేకమైన సినిమా అవుతుందని అతను భావిస్తున్నాడు. ఇప్పటికే బిచ్చగాడి పాత్ర చేయడం కోసం దర్శకుడి దగ్గర ఇన్ పుట్స్ తీసుకుని సన్నద్ధమవుతున్నాడట. ఇక తెలుగులో ‘బిచ్చగాడు’ 70 రోజులు దాటినా స్టడీ కలెక్షన్లతో సాగిపోతోంది.