Begin typing your search above and press return to search.

ఈగ విలన్‌ విడాకుల ప్రేమ కథ

By:  Tupaki Desk   |   13 Sep 2015 7:30 AM GMT
ఈగ విలన్‌ విడాకుల ప్రేమ కథ
X
ఈగ విల‌న్ సుదీప్ భార్య‌తో విడాకులు తీసుకుంటున్నాడు... అన్న వార్త శాండ‌ల్ వుడ్‌ తో పాటు అన్ని ప‌రిశ్ర‌మ‌ల్లోనూ మార్మోగిపోయింది. సుదీప్ - ప్రియ జంట‌కు 11ఏళ్ల చిన్నారి కూడా ఉంది. భార్యాభ‌ర్త‌లు విడిపోవ‌డంతో కూతురు శాన్వి భ‌విష్య‌త్ ఏమిటి? అన్నది ప్ర‌శ్నార్థ‌క‌మైంది. అయితే త‌న కూతురికి ఏ లోటూ లేకుండా సుదీప్ త‌న భార్య‌కు 19 కోట్లు భ‌ర‌ణం ఇచ్చాడు. అదంతా నా భార్య‌ - కూతురు సేఫ్టీ కోస‌మే ఇచ్చాను. నా కూతురు నాకు చాలా స్పెష‌ల్‌... అని సుదీప్ చెప్పుకొచ్చాడు.

మనోడి లవ్‌ స్టోరీలోకి ఓ మారు తొంగి చూస్తే... సుదీప్ - ప్రియ ప‌దేళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఓ కామ‌న్ ఫ్రెండు ద్వారా ఫ్రెండ్ షిప్ కుదిరింది. ఆ త‌ర్వాత‌ స్నేహం కాస్తా ప్రేమ‌కు, అటుపై పెళ్లికి దారి తీసింది. 14 ఏళ్ల క్రితం వీరి పెళ్ల‌య్యింది. సుదీప్ కెరీర్ ప‌రంగా ఇబ్బందుల్లో ఉన్న‌ప్పుడు భార్య స‌పోర్ట్ అయ్యింది. ఇద్దరూ బ్యాంకులో పని చేసేవారు. తరువాత మనోడు యాక్టర్‌ అయ్యాడు. అయితే వ్య‌క్తిగ‌త కార‌ణాల‌తో భార్య‌తో నాలుగేళ్ల క్రిత‌మే తీవ్ర‌మైన మ‌న‌స్ప‌ర్థ‌లు వ‌చ్చాయి. అప్ప‌ట్నుంచి ఈ ఇద్ద‌రూ విడివిడిగా ఉంటున్నారు. ఒకే న‌గ‌రంలో ఉన్నా వేర్వేరు ఇళ్ల‌లో నివాసం ఉంటున్నారు. ఇద్ద‌రూ ఓ అండ‌ర్‌ స్టాండింగ్ చేసుకుని ప‌బ్లిక్ వేడుక‌ల‌కు క‌లిసే వెళ్లేవారు. కూతురి భ‌విష్య‌త్ ఇబ్బందుల్లో ప‌డ‌కుండా స్కూలింగ్ చేయిస్తున్నారు.

కలసి ఉండకపోయినా కూడా... 2013లో ఈ ఇద్దరూ క‌లిసి ఓ ఈవెంట్ మేనేజ్‌ మెంట్ కంపెనీని కూడా ప్రారంభించారు. క‌లహాల కాపురం ఎందుకులే అనుకుని ఓ అండ‌ర్‌ స్టాండింగ్‌ కి వ‌చ్చారు. ఈ ఏడాది ఆగ‌ష్టులో సుదీప్ భార్యతో క‌లిసి విడాకుల‌కు అప్లికేష‌న్ పెట్టుకున్నారు. అయితే ముందుగా విడాకులు ప్రపోజ్‌ చేసింది తన భార్య ప్రియే అని సుదీప్‌ చెప్పాడు. ఆర్నెళ్ల‌లో విడాకులు మంజూరు కానుంది. ఇదండీ.. ఈగ విలన్‌ విడాకుల ప్రేమ కథ.