Begin typing your search above and press return to search.
పుట్టినరోజులు వదిలేసిన హీరో.. షాకింగ్ రీజన్!
By: Tupaki Desk | 17 Nov 2019 10:55 AM GMTటాలీవుడ్ లో పార్టీల కల్చర్ తెలిసిందే. పుట్టినరోజులతో పాటు కేక్ కటింగ్ కార్యక్రమాల జోరు నిరంతరం చూసేదే. ఇక స్టార్ల పుట్టినరోజులకు అభిమానులు కేక్ లు కట్ చేయడాలు.. భారీగా కటౌట్లు కట్టి ఊరంతా ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం వగైరా చూస్తూనే ఉంటాం. ఇటీవల ఓ ఇద్దరు స్టార్ హీరోల కోసం భీమవరంలో ఊరంతా ఫ్లెక్సీలు కట్టి గ్రాండ్ గా సెలబ్రేట్ చేశారు. కిలోమీటరు పొడవు గోడల్ని పోస్టర్లతో నింపేసి షాకిచ్చారు.
ఈ సందడి గొడవేమో కానీ టాలీవుడ్ కి బాగా సుపరిచితుడైన కిచ్చా సుదీప్ మాత్రం ఇలాంటి వాటికి వ్యతిరేకం అంటున్నాడు. హంగులు ఆర్భాటాలు తనకు నచ్చవని అన్నాడు. పుట్టినరోజులు జరుపుకోవడం మానేశానని తెలిపాడు. ఇక కేవలం రూ.200 ఖరీదు చేసే టీషర్టు అయినా తొడుక్కుంటానని ఖరీదైన బట్టలు కావాలని అనుకోనని తెలిపారు. ఒకప్పటిలా ఇప్పుడు కూడా చేయలేనని అన్నారు. అభిమానులు సైతం ఇలాంటి వాటికి అనవసరంగా ఖర్చు చేయకుండా ఊళ్లోనే మంచి పనులు చేయాలని సూచించాడు. స్టార్ల బర్త్ డేలకు హంగామా అవసరం లేదని అన్నాడు.
అయితే తాను పుట్టినరోజు జరుపుకోకపోవడానికి కారణమేమిటి? అంటే.. ఇంతకుముందు తాను ఓ బర్త్ డే వేళ లగ్జరీ పార్టీ చేసుకున్నానని పార్టీ అంతా అయ్యి వెళ్లిపోతుంటే .. కింద పడి ఉన్న కేక్ తీసుకుని తింటున్న చిన్నారి కంట పడిందని .. ఆ తర్వాత తాను పూర్తిగా మారిపోయానని చెప్పారు. ఇక పుట్టినరోజులు మానేసిన వేరొక స్టార్ గురించి ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి. తెలుగమ్మాయి .. అందాల హీరోయిన్ రాశీ సైతం నిరంతరం పుట్టినరోజులు జరుపుకునేవారు. కానీ ఒకరోజు సడెన్ గా ఇక పుట్టినరోజుల్ని వదిలేశారు. అందుకు కారణం .. తన పుట్టినరోజుల్ని గ్రాండ్ గా జరిపించే నాన్న గారు చనిపోయారని అది కూడా తన పుట్టినరోజే ఆయన పోవడం కలచివేసిందని అలీతో జాలీగా టాక్ షోలో తెలిపారు. షూటింగులో ఉన్న తనకు ఆ వార్త వినాల్సి రావడంతో అన్నయ్యతో పాటు దిగ్భాంతికి గురయ్యానని వెల్లడించారు. ఈ రోజుల్లో షోకుల కోసం రూ.5000 నుంచి రూ.10 వేల వరకూ ఒక జత బట్టలు కొనుక్కునేందుకు ఖర్చు చేస్తున్నారు యూత్. ఇంతకుముందు ఒక 10 మంది ఉండే ఉమ్మడి కుటుంబం నెలరోజుల పాటు బతికేందుకు చేసిన ఖర్చు అది. ఈ హంగులు ఆర్భాటాలు శాశ్వతం కాదు అని అర్థమయ్యేలోపే అంతా అయిపోతుంది. లైఫ్ అంటే ఇంతే మరి.