Begin typing your search above and press return to search.
బాహుబలి-2లో అతనుండడా?
By: Tupaki Desk | 16 Aug 2016 9:44 AM GMT‘ఈగ’ సినిమాతో తెలుగులోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన సుదీప్.. ఇక్కడ బాగా బిజీ అయిపోతాడనుకున్నారంతా. కానీ రెండో మూడో సినిమాలకు మించి చేయలేదతను. ‘బాహుబలి: ది బిగినింగ్’లో కనిపించినా అది చాలా చిన్న పాత్ర. ఏదో సుదీప్ మీద అభిమానంతో రాజమౌళి ఏదో ఒక క్యారెక్టర్ అన్నట్లు సుదీప్ తో చేయించినట్లున్నాడు తప్ప.. సినిమాలో ఆ పాత్రకు పెద్దగా ప్రాధాన్యం లేదు. ఐతే తొలి భాగంలో సుదీప్ కు పెద్దగా రోల్ లేకపోయినా.. ‘బాహుబలి: ది కంక్లూజన్’లో ఆ పాత్ర కీలకం అవుతుందని.. చివర్లో భల్లాలదేవుడితో యుద్ధం చేయాల్సి వచ్చినపుడు కట్టప్ప-శివుడు.. ఈ పర్షియన్ రాజు సాయమే తీసుకుంటారని.. యుద్ధ సన్నివేశాల్లో సుదీప్ కీలకం అవుతాడని ఆ మధ్య వార్తలొచ్చాయి.
ఐతే ‘బాహుబలి’ విషయంలో సుదీప్ స్పందన చూస్తుంటే మాత్రం అలాంటిదేమీ ఉండదేమో అనిపిస్తోంది. ‘బాహుబలి: ది కంక్లూజన్’లో తనకు చోటుందో లేదో తెలియదని.. ఇప్పటికైతే ఆ చిత్రం బృందం తనను సంప్రదించలేదని సుదీప్ చెప్పాడు. ఇలా నర్మగర్భంగా వ్యాఖ్యలు చేశాడే కానీ.. రాజమౌళి గతంలో ఏం చెప్పాడన్నది మాత్రం సుదీప్ వెల్లడించలేదు. ‘బాహుబలి: ది కంక్లూజన్’ క్లైమాక్స్ ఆల్రెడీ రెండు నెలల నుంచి షూట్ చేస్తున్నారు. రెండో భాగంలో సుదీప్ ఉన్నట్లయితే ఈపాటికే అతను షూటింగులో పాల్గొనాల్సింది. ఇలా తనను సంప్రదించలేదని.. ఉన్నానో లేదో తెలియదని అనేవాడు కాదు. కాబట్టి సుదీప్ పాత్ర ఆ చిన్న సన్నివేశంతోనే ముగిసిపోయిందనే అనుకోవాలి.