Begin typing your search above and press return to search.
కామన్‌గా కిచ్చాదే రచ్చ అంతా...
By: Tupaki Desk | 23 Jun 2015 4:38 PM GMTఇటీవలి కాలంలో ఒకే జోనర్ సినిమాల గురించిన ఆసక్తికర కథనాలు మీడియాలో వస్తున్నాయి. వాటిలో ఒక సినిమాతో ఇంకో సినిమా పోలికలు ఏమున్నాయో వెతుకుతున్నారు. ప్రభాస్ బాహుబలి, విజయ్ పులి చిత్రాలు రెండు ఒకే జోనర్‌లో వస్తున్నాయి. ఇవి రెండూ వార్ ఎపిక్ సినిమాలే. ఇమాజినేటెడ్ కథాంశాలే. అందువల్ల ఈ రెండిటిలో ఏది బెటర్? అన్నదాని గురించి డిబేట్ నడుస్తోంది.
ఇప్పటికే బాహుబలి ట్రైలర్‌లకు చక్కని ప్రశంసలొచ్చాయి. పులి టీజర్‌లో విజయ్ లుక్‌ని బాహుబలిలో ప్రభాస్ లుక్‌ని పోల్చి చూసినప్పుడు విజయ్ పూర్తిగా తేలిపోయాడంటూ కామెంట్లు వినిపించాయి. ప్రభాస్, రానా లుక్‌తో పోలిస్తే విజయ్ వేషధారణ యాప్ట్‌గా లేదన్న విమర్శలొచ్చాయి. జానపదుల లుక్‌లో కనిపించకుండా మోడ్రన్ గెటప్‌లో కనిపించాడని అన్నారంతా. అలాగే బాహుబలిలో రమ్యకృష్ణ లుక్, పులిలో శ్రీదేవి లుక్‌ని పోల్చి చూశారు. ఈ ఇద్దరిలో రమ్య శివగామిగా అదిరిపోయింది. శ్రీదేవిలో మాత్రం వృద్ధాప్య ఛాయలు స్పష్టంగా కనిపించాయన్న విమర్శలొచ్చాయి.
అయితే ఈ పోలికల మాటేమో గానీ ప్రస్తుతం ఈ రెండు క్రేజీ ప్రాజెక్టుల్లో నటించిన ఓ కామన్ నటుడి గురించి మాట్లాడుకుంటున్నారంతా. కన్నడ హీరో 'ఈగ' విలన్ సుదీప్ ఈ రెండు చిత్రాల్లో కీలకపాత్రలు పోషించాడు. బాహుబలిలో అస్లామ్ ఖాన్ పాత్రలో కొత్త గెటప్‌లో కనిపించాడు. అలాగే విజయ్ పులిలో విలన్ పాత్రలో నటించాడు. ఈ రెండు సినిమాల్లో కిచ్చా పాత్ర హైలైట్‌గా ఉంటుందన్న ప్రచారం మొదలైంది. ఆయనదే రచ్చంతా..