Begin typing your search above and press return to search.

అరకు రాజుగా సైరా సుదీప్ ?

By:  Tupaki Desk   |   25 Aug 2018 1:22 PM GMT
అరకు రాజుగా సైరా సుదీప్ ?
X
మనకంటే ఈగ విలన్ గా బాహుబలిలో చిన్న రాజుగా పరిచయమే కానీ కిచ్చ సుదీప్ కన్నడలో స్టార్ హీరో. మన భాషలో చెప్పాలంటే అక్కడి మార్కెట్ కు తగ్గట్టు ప్రభాస్ తరహా ఫాలోయింగ్ ని అక్కడ చూడొచ్చు. వీలు కుదిరితేనో లేక సబ్జెక్టు విపరీతంగా నచ్చితే తప్ప ఇతర భాషల్లో చేయడానికి ఒప్పుకోని సుదీప్ మెగాస్టార్ చిరంజీవి సినిమా అంటే ఊరుకుంటాడా. అందులోనూ సైరా లాంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టు అంటే ఎవరైనా ఓకే అనాల్సిందే. అఫ్ కోర్స్ సుదీప్ కూడా అదే చేసాడు లెండి. షూటింగ్ కూడా జరిగింది. కానీ ఏ పాత్ర పోషించాడు అనే దాని గురించి మాత్రం వివరాలు బయటికి రాలేదు. విశ్వసనీయ సమాచారం మేరకు ఇందులో సుదీప్ అరకు రాజుగా కనిపిస్తాడట. అరకు సంస్థానం తరఫున 1846లో గిద్దలూరు తిరుగుబాటులో ఉయ్యాలవాడ నరసింహారెడ్డితో పాటు యుద్ధంలో పాల్గొన్న వీరుడిగా సుదీప్ పాత్ర ఓ రేంజ్ లో ఉంటుందని టాక్.

అవుకు రాజుల్లో చివరివాడైన రాజుగా సుదీప్ తో పాటు వందకు పైగా స్వాతంత్ర సమర యోధులు అందులో పాల్గొని సుమారు 12 ఏళ్ళ దాకా అండమాన్ జైలులో దుర్భరమైన జైలు శిక్షకు గురవుతారట. అది జరుగుతుందని తెలిసే నరసింహరెడ్డితో పాటు కదన రంగంలోకి దూకిన ఆరకు రాజు అరాచకం చూడాలంటె ఇంకా చాలా టైం వెయిట్ చేయాలి కానీ ఈ న్యూస్ మాత్రం మెగా ఫాన్స్ ని ఆనందంలో ముంచెత్తుతోంది. సుదీప్ ఉన్నందుకు శాండల్ వుడ్ లో సైరా మీద భారీ బిజినెస్ జరిగే అవకాశం ఉంది. దీనికి సంబంధించి సుదీప్ ఏ ట్వీట్ చేసినా ఫాన్స్ విపరీతంగా స్పందిస్తున్నారు. మెగా హీరోలకు అందులోనూ చిరుకి కర్ణాటకలో అభిమానులు ఎక్కువ. ఇక తమ సుదీప్ తో చిరు కలయిక అంటే ఊరికే ఉంటారా. వచ్చే వేసవి విడుదల టార్గెట్ చేసుకున్న సైరా టీజర్ ఇటీవలే చిరు పుట్టినరోజు సందర్భంగా విడుదలై 12 మిలియన్ల వ్యూస్ దాటేసి దూసుకుపోతున్న సంగతి తెలిసిందే.