Begin typing your search above and press return to search.
రానా కోసం అనుకున్నది వెంకీ చేశాడు
By: Tupaki Desk | 2 April 2017 8:29 AM GMTఈ శుక్రవారం విడుదలై ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ దక్కించుకుంటోంది విక్టరీ వెంకటేష్ కొత్త సినిమా ‘గురు’. ఇది తమిళ.. హిందీ భాషల్లో మాధవన్ హీరోగా తెరకెక్కిన సినిమాకు రీమేక్ అన్న సంగతి తెలిసిందే. ఐతే దర్శకురాలు సుధ కొంగర ఈ చిత్రాన్ని తమిళ-హిందీ భాషల్లో తెరకెక్కడానికి ముందే తెలుగులో వెంకీతోనే చేయాలనుకున్నట్లు వెల్లడించిన సంగతి తెలిసిందే. వెంకీకి అప్పట్లో డెంగ్యూ జ్వరం ఉండటం.. ఇంకొన్ని కారణాల వల్ల చేయలేకపోతే ముందు మాధవన్ తో తమిళం.. హిందీ భాషల్లో తెరకెక్కించింది సుధ. ఐతే ఇప్పుడు బయటికి వచ్చిన విషయం ఏంటంటే.. వెంకీ కంటే ముందుగా రానాతో ఈ సినిమా చేయాలనుకుందట సుధ. ఏడేళ్ల కిందటే అతడికి ఆ కథ చెప్పిందట సుధ.
‘‘2010లో రానాకు ‘గురు’ కథ చెప్పాను. రానా కుర్రాడు కాబట్టి.. కథకు కొంచెం లవ్.. రొమాన్స్ యాడ్ చేశాను. స్క్రిప్టు నచ్చినప్పటికీ అప్పట్లో రానాకి ఈ సినిమా చేయడం కుదరలేదు. తర్వాత రెండేళ్లకు వెంకీకి ఈ కథ చెప్పా. ఏదో శక్తి నడిపించినట్లుగానే ముందు రానా దగ్గరకు వచ్చిన కథ... ఆ తర్వాత మూడేళ్లకు వెంకీకి కుదరడం భలే గమ్మత్తుగా అనిపించింది. వెంకటేష్ గారికి రమణ మహర్షి అంటే చాలా ఇష్టం. నేను యాదృచ్ఛికంగా నా ఫ్రెండ్ ఇచ్చిన రమణ మహర్షి డైరీలోనే ఈ సినిమా స్క్రిప్టుకు సంబంధించిన పాయింట్స్ రాసుకుని వెళ్లాను. అది చూసి ఆయన ఆశ్చర్యపోయారు’’ అని సుధ చెప్పింది. తనను కలిశాక వెంకీని సుధ కలిసి విషయం రానాకు తెలియదట. అతనొచ్చి ‘సాలా ఖడూస్’ గురించి చెబితే.. తాను అప్పటికే ఈ సినిమా చేయాలని ఫిక్సయినట్లు వెంకీ చెబితే రానా ఆశ్చర్యపోయాడట.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/