Begin typing your search above and press return to search.
సుధ కొంగర పేరు 'ఆకాశమేహద్దుగా' మారుమోగుతోంది
By: Tupaki Desk | 15 Nov 2020 7:50 AM GMTసుధ కొంగర.. ఇప్పుడు ఈ పేరు దేశవ్యాప్తంగా వినిపిస్తున్నది. అందుకు కారణం ఆమె తెరకెక్కించిన ' ఆకాశమే నీ హద్దురా '(తమిళంలో సూరరై పొట్రూ) చిత్రం ఘనవిజయం సాధించడమే. ఓ మహిళా దర్శకురాలు తొలిసారి ఓ స్టార్ ఇమేజ్ ఉన్న హీరోను డైరెక్ట్చేసి సక్సెస్ కావడంతో ఆమెకు ప్రశంసలు దక్కుతున్నాయి. ఎయిర్ ఇండియా వ్యవస్థాపకుడు కెప్టెన్ గోపీనాథ్ జీవితచరిత్ర ఆధారంగా సుధా కొంగర తెరకెక్కించిన ఆకాశమే నీ హద్దురా (తమిళంలో సూరరై పొట్రూ) చిత్రం పేరుతో విడుదలై ఘన విజయం సాధించింది.
ఓటీటీలో ద్వారా విడుదలైన ఆ చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకున్నది. సినిమా ఇండస్ట్రీలో మహిళా దర్శకులు చాలా అరుదు. వాళ్లు తీసేవన్ని కొత్త తరహా చిత్రాలు, ప్రయోగాత్మక చిత్రాలు కావడంతో స్టార్‌హీరోలు వాళ్లకు అవకాశం ఇవ్వరు. కానీ తొలిసారి సుధ కొంగరకు తమిళ హీరో సూర్య అవకాశం ఇచ్చారు. మహిళ దర్శకురాలు కూడా స్టార్ హీరోలతో డీల్ చేయగలదని.. భారీ ప్రాజెక్టులను తీసుకోగలదని సుధ కొంగర నిరూపించింది. ‘సింప్లీ ఫ్లై’ అనే పుస్తకం ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కింది. ఓ వ్యక్తి జీవితంలో జరిగిన ఎంతో నాటకీయంగా తెరకెక్కించడంతో సుధా కొంగర విజయం సాధించారు.
ప్రేక్షకుడికి ఏ మాత్రం బోర్ కొట్టనీయకుండా సినిమాను ముందుకు నడిపించాలి. బయోపిక్‌ను ఆసక్తికరంగా తెరకెక్కించడంలో సుధా కొంగర సక్సెస్ అయ్యారు. చాలా సహజంగా తీస్తూనే ప్రేక్షకులకు ఏ మాత్రం బోర్ కొట్టనివ్వకుండా సినిమాను తెరకెక్కించారు. సుధ.. ప్రముఖ దర్శకుడు మణిరత్నంతో కలిసి ఏడేళ్లు అసోసియేట్ డైరెక్టర్‌గా పనిచేసింది. 2016 లో ఆమె "సాలా ఖడూస్" చిత్రం ద్వారా హిందీ చిత్రసీమ లోకి అడుగుపెట్టింది. ఈ చిత్రం తమిళంలో "ఇరుది సుట్రు" గా విడుదల అయింది. ఈ చిత్రం ద్వారా తమిళంలో ఫిలింఫేర్ అవార్డు గెలుచుకున్నది.అదే సినిమా తెలుగులో వెంకటేష్ హీరోగా 'గురు'గా తెరకెక్కింది.