Begin typing your search above and press return to search.
మన సుధ తర్వాత సినిమా ఫిక్స్
By: Tupaki Desk | 12 Feb 2021 8:10 AM GMTతెలుగు దర్శకురాలు సుధ కొంగర తమిళంలో సూర్యతో 'ఆకాశమే నీ హద్దు' సినిమాతో భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. డైరెక్ట్ డిజిటల్ లో విడుదలైన ఆ సినిమా భారీ వ్యూస్ ను దక్కించుకుంది. అయితే థియేటర్లలో ఆ సినిమా విడుదల అయ్యి ఉంటే ఖచ్చితంగా వంద కోట్లకు పైగా వసూళ్లు సాధించేది అంటూ సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. సుదీర్ఘ కాలంగా ఇండస్ట్రీలో కొనసాగుతున్న సుధ కొంగర ఎట్టకేలకు సక్సెస్ రావడంతో పాటు వరుసగా ఆఫర్లు వస్తున్నాయి. ప్రస్తుతం ఆమెతో సినిమాను చేసేందుకు స్టార్స్ ఎంతో మంది ఆసక్తి చూపిస్తున్నారు. బాలీవుడ్ నుండి కూడా ఈమెకు పిలుపు వస్తున్నట్లుగా సమాచారం అందుతోంది. ఇంతగా బజ్ ఉన్న సుధ కొంగర తదుపరి సినిమా ఏమై ఉంటుందా అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
సుధ కొంగర తదుపరి సినిమా విషయంలో క్లారిటీ ఇచ్చేందుకు సిద్దం అవుతున్నారు. ఇప్పటికే ఆమె కొత్త సినిమాకు సంబంధించిన చర్చలు అన్ని పూర్తి అయ్యాట. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం ఒకటి రెండు రోజుల్లోనే ఒక స్టార్ హీరోతో ఆమె తదుపరి సినిమా ను అధికారికంగా ప్రకటించబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. తెలుగు హీరోతో ఆమె సినిమా ఉంటుందా లేదంటే తమిళ హీరోతోనే ఆమె తదుపరి సినిమా చేయబోతుందా అనే విషయమై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. తమిళంలో పెద్ద పెద్ద హీరోలు ఆమె తో వర్క్ చేసేందుకు సిద్దంగా ఉన్నారనే వార్తలు వస్తున్నాయి. కనుక మన తెలుగు దర్శకురాలు మళ్లీ తమిళ స్టార్ హీరోనే డైరెక్ట్ చేసే అవకాశాలు లేకపోలేదు అంటున్నారు. మరి ఆమె ప్రకటన ఏంటీ అనేది తెలియాలంటే ఒకటి రెండు రోజులు వెయిట్ చేయాల్సిందే.