Begin typing your search above and press return to search.
డైరెక్టర్ ఫస్ట్ ఛాయిస్.. వెంకటేష్
By: Tupaki Desk | 31 March 2017 4:58 AM GMTవెంకటేష్ నటించిన గురు చిత్రం ఇవాళే రిలీజ్. సరైన డేట్ దొరక్క విడుదల కొంత ఆలస్యమైనా.. సమ్మర్ సీజన్ లో సూపర్బ్ టైమింగ్ లోనే రిలీజ్ అవుతుండడం విశేషం. తమిళ్ లో సాలా ఖదూస్.. హిందీలో ఇరుదు సూత్రుగా తానే రూపొందించిన మూవీని.. తెలుగులో గురు పేరుతో రీమేక్ చేస్తున్నారు దర్శకురాలు సుధ కొంగర.
ఇది రీమేక్ మూవీ అయినా.. తనకు మాత్రం స్ట్రెయిట్ ఫిలిం అని డైరెక్టర్ చెబుతుండడం విశేషం. స్లమ్ ఏరియాస్ లో ఉండే అమ్మాయిలు ప్రభుత్వోద్యోగం సంపాదించడానికి ఆటల్లో ప్రావీణ్యం పొందేందుకు ప్రయత్నిస్తున్నారనే ఓ ఆర్టికల్ ను 2008లో చదివారట ఆమె. అప్పుడు మరింతగా రీసెర్చ్ చేసి.. రియలిస్టిక్ గా ఈ కథను రాసుకున్నట్లు చెప్పారు. అయితే.. మొదట ఈ కథను రాసినప్పుడే వెంకటేష్ ను కోచ్ పాత్రలో చూపాలని ప్రయత్నించినా.. అప్పట్లో ప్రాజెక్ట్ సాధ్యం కాలేదని అన్నారు. ఆ తర్వాత మాధవన్ నటించడం.. మంచి హిట్ సాధించడం జరిగిపోయాయి.
మళ్లీ ఈ చిత్రాన్ని తెలుగులో వెంకటేష్ తో చేయాలనే కండిషన్ తోనే తమిళ్-హిందీ వెర్షన్ ను ముందే చేశారట. రిలీజ్ కి ముందే తెలుగు డబ్బింగ్ వెర్షన్ కు మంచి ఆఫర్ వచ్చినా అందుకే తిరస్కరించినట్లు సుధ కొంగర తెలిపారు. మాధవన్ ఈ రోల్ చేసేందుకు కొంత మేకోవర్ చేయాలని.. అదే వెంకటేష్ కు అయితే సరిగా నప్పుతుందని చెప్పారామె. ఇప్పుడు అందరూ రీమేక్ అంటున్నా సరే.. తాను మళ్లీ స్ట్రెయిట్ ఫిలిం మాదిరిగానే రూపొందించానని అంటున్నారు సుధ కొంగర.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/