Begin typing your search above and press return to search.

సెప్టెంబ‌ర్ 5 సాయంత్రం ఏం చెబుతారో చూద్దాం!

By:  Tupaki Desk   |   4 Sept 2022 4:20 PM IST
సెప్టెంబ‌ర్ 5 సాయంత్రం ఏం చెబుతారో చూద్దాం!
X
యంగ్ హీరో సుధీర్ బాబు కెరీర్ జ‌ర్నీ గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. మూడు పువ్వులు. ఆరు కాయ‌లుగా టాలీవుడ్ లో జ‌ర్నీ ముందుకు సాగిపోతుంది. ఇప్ప‌టికే యంగ్ హీరో ల‌వ‌ర్ బోయ్ ఇమేజ్ ని సొంతం చేసుకున్నాడు. రొటీన్ కి భిన్న‌మైన ప్రేమ క‌థ‌ల‌తో ప్రేక్ష‌కుల్ని ఆక‌ట్టుకునే ప్ర‌య‌త్నం ప్రశంస‌నీయం. మ‌ధ్య‌మ‌ధ్య‌లో బాలీవుడ్ ని సైతం ట‌చ్ చేస్తూ త‌న‌లో యాక్ష‌న్ యాంగిల్ ని హైలైట్ చేస్తున్నాడు.

తెలుగులో మాత్రం ఒకే జానర్ చిత్రాల్లోనే ఎక్కువ‌గా న‌టిస్తున్నాడు. తాజాగా మ‌రోసారి ఇంద్ర గంటి మోహ‌న్ కృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతోన్న `ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి` అనే సినిమా చేస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఇంద్ర‌గంటి సినిమాల‌కు ప్ర‌త్యేక‌మైన ఫ్యాన్స్ ఉన్నారు. ద‌ర్శ‌కుడిగా త‌న‌కంటూ ఓ ఇమేజ్ ఉంది. ఈ నేప‌థ్యంలో ఈ కాంబినేష‌న్ మ‌రోసారి చేతులు క‌లిపింది.

ఇప్ప‌టికే రిలీజ్ అయిన టీజ‌ర్... ప్ర‌చార చిత్రాలు సినిమాకి మంచి బ‌జ్ ని తీసుకొచ్చిన సంగ‌తి తెలిసిందే. తాజాగా ట్రైల‌ర్ లాంచ్ అనౌన్స్ మెంట్ ని డిఫ‌రెంట్ వేలో ప్రేక్ష‌కుల ముందుకు ఓ వీడియో రూపంలో తీసుకొచ్చారు. ఓ సారి ఆ వీడియో చూస్తే..ఇందులో కృతిశెట్టి... సుదీర్ బాబు మ‌ధ్య‌నే షూట్ చేసారు.

`` కృతిశెట్టి కూర్చుని ఉండ‌గా `హే ఎంత సేపు అయింది వ‌చ్చి` అంటూ సుదీర్ బాబు .. కృతి ముందు కుర్చుంటాడు. జ‌స్ట్ ఇప్పుడేలే అంటుంది కృతి. ఏం ఆలోచించావు ఒకేనా? ఒప్పుకోవ‌చ్చు క‌దా? అంటే లేదురా సారీ అంటుంది కృతి. నాకు నీతోనే కంటున్యూ అవ్వాల‌ని ఉంది..క‌ష్ట‌మే అభి..నువ్వు నాకు ఎంత ముఖ్య‌మో నీకు తెలుసు. ఐ అండ‌ర్ స్టాండ్.

కానీ ఏం చేయ‌లేం. నీకు తెలుసు ఎంత క‌ష్ట‌మే. ఎలాంటి అమ్మాయి కావాల‌నుకున్నానో ఆ ఫీచ‌ర్స్ అన్నీ నీలో ఉన్నాయి. దానికి కృతి థాంక్స్ చెబుతుంది. దీంతో ఫీలైన అభి నీకేమైనా పిచ్చా? ఈసారికి వేరే అమ్మాయిని చూసుకుంటే బెట‌రేమో అంటుంది. మా ఇంట్లో ఒప్పుకోరు. నువ్వెంత మాట్లాడినా మా ఇంట్లో ఒప్పుకోరు. అలాంట‌ప్పుడు చెప్ప‌కుండా వ‌చ్చేయ్ అంటాడు? డ‌బ్బులు కావాలంటే ఇస్తాను అంటాడు అభి..``నీకు సెన్స్ ఉందా? ఏం మాట్లాడుతున్నావో తెలుస్తుందా? ఒక్క సినిమాలో లీడ్ రోల్ చేయ‌మ‌ని అడుగుతున్నా``..అస‌లు లీడ్ రోల్ వాల్యూ అర్ధ‌మ‌వుతుందా.

బ‌య‌ట ఎంత మంది వెయిట్ చేస్తున్నారో తెలుసా? నాకు ఎంత ఇంట్రెస్ట్ ఉన్నా మా ఇంట్లో వాళ్లు సినిమాల్లోకి పంపించారు. అలాగైతే ఓ ప‌ని చేద్దాం. నేను ఓ ర‌ఫ్ ట్రైల‌ర్ చూపిస్తాను. దాన్ని మీ ఇంట్లో చూపించు. ఎందుకు ఒప్పుకోరో? చూద్దాం అంటూ కృతి..సుధీర్ బాబు మ‌ధ్య సాగే ఇంట్రెస్టింగ్ డిస్క‌ష‌న్ వీడియో ఆక‌ట్టుకుంటుంది.

ఈ రకంగా ట్రైల‌ర్ లాంచ్ డేట్ ని వినూత్నంగా ప్ర‌చారం చేసారు. ఇక ట్రైల‌ర్ ని సెప్టెంబ‌ర్ 5 న సాయంత్ర 5 గంట‌ల‌కు సూప‌ర్ స్టార్ మ‌హేష్ చేతుల మీదుగా లాంచ్ చేస్తున్నారు. ఈ చిత్రాన్ని గాజులపల్లె సుధీర్ బాబు సమర్పణలో బెంచ్‌మార్క్ స్టూడియోస్- మైత్రీ మూవీ మేక‌ర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.