Begin typing your search above and press return to search.
'ఆ అమ్మాయి..' స్మోకింగ్ హాట్ ఫస్ట్ లుక్ అప్డేట్..!
By: Tupaki Desk | 31 Dec 2021 4:05 PM IST'అష్టాచమ్మ' సినిమాతో డైరెక్టర్ గా పరిచయమైన ఇంద్రగంటి మోహనకృష్ణ.. టాలీవుడ్ లో మంచి అభిరుచి కలిగిన దర్శకుడిగా పేరు తెచ్చుకున్నారు. ప్రస్తుతం సుధీర్ బాబు హీరోగా ఇంద్రగంటి తెరకెక్కిస్తున్న మూవీ ''ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి''. ఇది 'సమ్మోహనం' 'వి' సినిమాల తర్వాత వీరి కాంబినేషన్ లో వస్తున్న హ్యాట్రిక్ మూవీ. ఇందులో సుధీర్ సరసన కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటోంది. ఈ నేపథ్యంలో మేకర్స్ ప్రమోషన్స్ మొదలు పెడుతున్నారు.
''ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి'' సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ని న్యూ ఇయర్ కానుకగా విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం తెలిపింది. 2022 మొదటి రోజున స్మోకింగ్ హాట్ ఫస్ట్ లుక్ రాబోతోందని హీరో సుధీర్ బాబు ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా ఓ గ్లిమ్స్ ని అభిమానులతో పంచుకున్నారు. ఇందులో సుధీర్ ఫేస్ చూపించకుండా వాచ్ లైటర్ తో సిగరెట్ ముట్టించుకుంటూ కనిపించారు. అదే సమయంలో హీరోయిన్ కృతి శెట్టి అద్దం చూసుకుంటూ ఐ లైనర్ పెట్టుకునే ఓ ఫోటోని షేర్ చేసింది.
కాగా, 'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి' చిత్రాన్ని గాజులపల్లె సుధీర్ బాబు సమర్పణలో బెంచ్ మార్క్ స్టూడియోస్ పతాకంపై బి మహేంద్రబాబు - కిరణ్ బళ్లపల్లి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమా నిర్మాణంలో భాగం పంచుకున్నారు. లవ్ అండ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రానికి వివేక్ సాగర్ సంగీతం సమకూరుస్తున్నారు.
పి జి విందా సినిమాటోగ్రఫీ అందించగా.. సాహి సురేష్ ఆర్ట్ డైరెక్టర్ గా వర్క్ చేశారు. మార్తాండ్ కె వెంకటేష్ ఎడిటర్ గా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రంలో అవసరాల శ్రీనివాస్ - వెన్నెల కిషోర్ - రాహుల్ రామకృష్ణ, శ్రీకాంత్ అయ్యంగార్ - కళ్యాణి నటరాజన్ తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్నారు. 'శ్రీదేవి సోడా సెంటర్' సినిమాతో ఆశించిన విజయాన్ని అందుకోలేక పోయిన సుధీర్ బాబు.. ఇప్పుడు ఇంద్రగంటితో చేస్తున్న 'ఆ అమ్మాయి..' చిత్రంతో సూపర్ హిట్ అందుకుంటారేమో చూడాలి.