Begin typing your search above and press return to search.

మ‌హేష్ మేన‌ల్లుడు చిచ్చ‌ర‌పిడుగే..

By:  Tupaki Desk   |   6 March 2017 5:30 PM GMT
మ‌హేష్ మేన‌ల్లుడు చిచ్చ‌ర‌పిడుగే..
X
‘భ‌లే భ‌లే మ‌గాడివోయ్’ సినిమా చూసిన వాళ్ల‌కు చిన్న‌ప్ప‌టి నానిగా క‌నిపించిన కుర్రాడు గుర్తుండే ఉంటాడు. ఆ పాత్ర‌లో ఆ కుర్రాడి న‌ట‌న‌.. హావ‌భావాలు బాగానే ఆక‌ట్టుకున్నాయి. తాజాగా ‘విన్న‌ర్’ సినిమాలో చిన్న‌ప్ప‌టి సాయిధ‌రమ్ గానూ మెప్పించాడు అదే కుర్రాడు. ఇంత‌కీ ఈ పిల్లాడు ఎవ‌రో తెలుసా.. మ‌హేష్ బాబుకు మేన‌ల్లుడు.. సుధీర్ బాబుకు త‌న‌యుడు. అత‌డి పేరు చ‌రిత్‌.

సుధీర్ బాబు ఒక‌ప్పుడు జిమ్నాస్టే కాక బ్యాడ్మింట‌న్ ప్లేయ‌ర్ కూడా. చ‌రిత్ కూడా అత‌ను తండ్రి బాట‌లోనే న‌డుస్తున్న‌ట్లున్నాడు. అత‌ను కూడా జిమ్నాస్టిక్స్ లో స‌త్తా చాటుతున్నాడు. హైద‌రాబాద్ లో జ‌రిగిన జిమ్నాస్టిక్స్ పోటీల్లో చ‌రిత్ అద్భుత విన్యాసాలు ప్ర‌ద‌ర్శిస్తున్న వీడియోను ట్విట్ట‌ర్లో షేర్ చేశాడు సుధీర్. ఆ విన్యాసాలు చూస్తే ఆశ్చ‌ర్యం క‌ల‌గ‌క మాన‌దు. పిట్ట కొంచెం కూత ఘ‌నం అనిపించాడు చ‌రిత్.

భ‌విష్య‌త్తులో చ‌రిత్ కూడా సినిమాల్లోకే రావ‌చ్చేమో కానీ.. ఇప్పుడైతే అత‌ణ్ని మంచి స్పోర్ట్స్ మ‌న్ గా చేసే ప్ర‌య‌త్నాల్లో ఉన్న‌ట్లున్నాడు సుధీర్ బాబు. అత‌డి జిమ్నాస్టిక్స్ విన్యాసాలు చూస్తే.. మంచి శిక్ష‌ణ ఇస్తే జాతీయ.. అంత‌ర్జాతీయ స్థాయికి ఎదిగే ప్ర‌తిభ ఉన్న‌ట్లే క‌నిపిస్తోంది. సుధీర్ బ్యాడ్మింట‌న్లో జాతీయ స్థాయి క్రీడాకారుడిగా ఎద‌గ‌డం విశేషం. పెళ్ల‌యి మ‌హేష్‌ ఫ్యామిలీలోకి వ‌చ్చాకే అత‌ను సినిమాల వైపు మ‌ళ్లాడు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/