Begin typing your search above and press return to search.
'మహేష్ సినిమాలను కేస్ స్టడీగా తీసుకుంటా'
By: Tupaki Desk | 27 Aug 2021 8:08 AM GMTసూపర్ స్టార్ ఫ్యామిలీ నుంచి హీరోగా పరిచయమైన సుధీర్ బాబు.. విభిన్నమైన చిత్రాలతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంటున్నాడు. కరుణ కుమార్ దర్శకత్వంలో సుధీర్ బాబు హీరోగా నటించిన ''శ్రీదేవి సోడా సెంటర్'' సినిమా ఈరోజు శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సందర్భంగా సుధీర్ బాబు పలు ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు.
''సుధీర్ బాబు ఎలాంటి పాత్రలైనా చేయగలడనే పేరు వచ్చింది. దర్శకులు రాసుకున్న కథలకు నేను సరిపోతాననే నమ్మకంతో నా వద్దకు వస్తున్నారు. అందుకే నాకు ఎక్కువ ఫెయిల్యూర్స్ లేవు. ఇండస్ట్రీలో నాకు మనుగడ ఉంటుందనేది ఫీలింగ్ ఉంది. నా ప్రతి సినిమా నన్ను ఒక్కో మెట్టు పైకి ఎక్కిస్తోంది'' అని సుధీర్ తెలిపారు.
''పలాస చూసిన తర్వాత కరుణ కుమార్ తో సినిమా చేద్దాం అనుకున్న కొన్ని రోజుల తర్వాత ‘శ్రీదేవి సోడా సెంటర్’ లైన్ చెప్పారు. చాలామంది మలయాళ సినిమాల గురించే మాట్లాడుకుంటారు. ఈ సినిమా చూశాక తెలుగు సినిమా కథల గురించి మాట్లాడుకుంటారు. ఇందులో ఎలక్ట్రీషియన్ సూరిబాబు పాత్రలో కనిపిస్తాను'' అని చెప్పారు.
''ఇది నాకు ఫిజికల్ గా చాలెంజింగ్ సినిమా. కొన్ని కారణాల వల్ల ఫస్ట్ షెడ్యూల్ లో సీన్స్ చివరిగా షూట్ చేయాల్సి వచ్చింది. అందువల్ల నేను మొదటి నుండి చివరి వరకు బాడీని సరిగ్గా మెయింటైన్ చేయాల్సి వచ్చింది. దీని కోసం నేను కఠినమైన డైట్ లో ఉండాలి. షూటింగ్ లో నేను ఒకసారి గాయపడ్డాను కూడా. ప్రతిరోజూ రాత్రి 9 గంటల వరకు షూటింగ్ చేసి.. రెండు గంటల పాటు హోటల్ దగ్గర జిమ్ లో వర్కవుట్స్ చేసాను''
"విభిన్నమైన కథలలో నన్ను ఆవిష్కరించుకోడానికి ప్రయత్నిస్తున్నాను. 'ఇమేజ్' అని పిలవకుండా ప్రేక్షకులకు వైవిధ్యాన్ని అందించాలనేదే నా ఆలోచన. కృష్ణ గారు - మహేష్ సినిమాలను కేస్ స్టడీ గా తీసుకుంటా. అయితే వారిలా కాకుండా నా శైలిలో నటించేందుకు ప్రయత్నిస్తా. కేవలం ఫ్యాన్స్ చూస్తే సినిమాలు హిట్ అవ్వవు. అన్ని వర్గాల ప్రేక్షకులు చూస్తేనే హిట్ అవుతాయి. అందుకు తగ్గట్టే నేను కథలను ఎంచుకుంటున్నాను''
''హీరో పాత్రలే నా తొలి ప్రాధాన్యం. ఆ తర్వాతే విలన్, ఇతర పాత్రల గురించి ఆలోచిస్తా. ‘భాగీ’ తర్వాత హిందీలో ఆఫర్స్ వచ్చినా.. తెలుగులో బిజీగా ఉండటంతో అక్కడ దృష్టి పెట్ట లేదు. ప్రస్తుతం ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ సినిమా చేస్తున్నాను. పుల్లెల గోపీచంద్ బయోపిక్ - హర్షవర్ధన్ దర్శకత్వంలో ఓ సినిమా - ‘70 ఎంఎం ఎంటర్టైన్మెంట్స్’ బ్యానర్ లోనే మరో సినిమా చేయాలి'' అని సుధీర్ బాబు చెప్పుకొచ్చారు.