Begin typing your search above and press return to search.

మహేష్ లుక్ గురించి బాలీవుడ్డోళ్లు అడిగారట

By:  Tupaki Desk   |   19 July 2015 5:31 PM GMT
మహేష్ లుక్ గురించి బాలీవుడ్డోళ్లు అడిగారట
X
తన బావమరిది మహేష్ సంగతి ఎత్తితే చాలు అతణ్ని ఆకాశానికి ఎత్తేస్తుంటాడు సుధీర్ బాబు. ఐతే బావమరిది ముందుండగా పొగిడే అవకాశం వచ్చి చాలా కాలమైంది. శ్రీమంతుడు ఆడియో ఫంక్షన్లో ఆ అవకాశం దొరగ్గానే రెచ్చిపోయాడు సుధీర్. ఆడియో పంక్షన్లో మిగతావాళ్లంతా మహేష్ గురించి మాట్లాడిన మాటలు ఓ ఎత్తయితే.. సుధీర్ పొగడ్తలు మరో ఎత్తని చెప్పాలి. బావమరిది గురించి బావ ఏమన్నాడో అతడి మాట్లలోనూ చదవండి.

‘‘శ్రీమంతుడు అని చెప్పంగానే మహేష్ పెద్ద ఆడి కార్లో వస్తాడని అనుకున్నా. కానీ సింపుల్గా సైకిల్ మీద వచ్చాడు. అంటే అంత పెద్ద స్టార్ అయి ఉండి అలా సైకిల్ మీద వచ్చే ఫస్ట్ లుక్ రిలీజ్ చేయడం గొప్ప విశేషం. ముంబయిలో నేను హిందీ సినిమా షూటింగులో పాల్గొంటుంటే అక్కడ కూడా శ్రీమంతుడులో మహేష్ లుక్ గురించి బాగా మాట్లాడుకోవడం విన్నాను. దీన్ని బట్టి నాకు తెలిసిందేమంటే.. మామూలుగా మనం బంగారం వేసుకున్నా, లేదా కార్లో వెళ్లినా మనకొక అందం, స్టేటస్ వస్తుంది. కానీ మహేష్ సంగతి అలా కాదు. అతను సైకిల్ మీద వస్తే సైకిల్ కే ఒక అందం వస్తుంది. చివరగా మహేష్ గురించి రెండు మాటలు చెబుతా. మన సూపర్ స్టార్ గుణంలో శ్రీమంతుడు. మనందరి అభిమానంలో శ్రీమంతుడు. మన అంచనాలు అనే అప్పును తీర్చే.. నిన్ను, నన్ను మనందరినీ ఎంటర్టైన్ చేసే కలెక్షన్లతో శ్రీమంతుడిగా మారి.. రికార్డులన్నీ దత్తత చేసుకుంటారని ఆశిస్తున్నా’’అన్నాడు సుధీర్ బాబు.