Begin typing your search above and press return to search.

భార్య ప్రియ‌ద‌ర్శిని బ‌ర్త్ డే వేడుక‌లలో సుధీర్ బాబు అండ్ ఫ్యామిలీ

By:  Tupaki Desk   |   8 Oct 2021 11:11 AM IST
భార్య ప్రియ‌ద‌ర్శిని బ‌ర్త్ డే వేడుక‌లలో సుధీర్ బాబు అండ్ ఫ్యామిలీ
X
యంగ్ హీరో సుధీర్ బాబు వ‌రుస సినిమాల‌తో కెరీర్ ప‌రంగా బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఎంత బిజీగా ఉన్నా భార్య పిల్ల‌ల కోసం అత‌డు విడిగా స‌మ‌యం కేటాయిస్తారు. నేడు త‌న భార్యామ‌ణి ప్రియ‌ద‌ర్శిని పుట్టిన‌రోజు సంద‌ర్భంగా సుధీర్ బాబు.. ప్ర‌త్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు.

``హ్యాపి బ‌ర్త్ డే ప్రియా.. మునుప‌టితో పోలిస్తే ప్ర‌తి ఏటా నువ్వు ఉత్త‌మంగా క‌నిపిస్తావు.. కుటుంబాన్ని ప్ర‌తి రోజూ సంతోషంగా ఉంచినందుకు ఇలా ప్రేమ‌ను విస్త‌రిస్తున్నందుకు థాంక్యూ.. జీవితంలో నువ్వు ఎంతో సంతోషంగా ఇలానే పూర్తి ప్రేమ‌ను పంచుతూ ఉండాలి..`` అంటూ విష్ చేశారు.

ప్రేమ వివాహం.. ఇద్ద‌రు వార‌సులు..

మ‌హేష్ సోద‌రి ప్రియ‌ద‌ర్శినిని సుధీర్ బాబు 2006లో పెళ్లాడారు. పోసాని నాగ సుధీర్ బాబు అత‌డి పూర్తి పేరు. ప్ర‌స్తుతం వ‌య‌సు 41. చ‌రిత మాన‌స్ - ద‌ర్శ‌న్ అనే ఇద్ద‌రు కుమారులు ఉన్నారు. టాలీవుడ్ లో ప్రామిస్సింగ్ హీరోగా సుధీర్ బాబుకు పేరుంది. ఇక సుధీర్ బాబు లెగ‌సీని న‌డిపించే వార‌సులుగా చ‌రిత మాన‌స్.. ద‌ర్శ‌న్ ని ఘ‌ట్ట‌మ‌నేని అభిమానులు భావిస్తున్నారు.

సుధీర్ బాబు- ప్రియ‌ద‌ర్శిని త‌ర‌చుగా ఫామ్ హౌస్ పార్టీల్లో క‌నిపిస్తుంటారు. సూప‌ర్ స్టార్ కృష్ణ‌తో పాటు సుధీర్ బాబు - ప్రియ‌ద‌ర్శిని వారి వార‌సులు మాన‌స్ - ద‌ర్శ‌న్ ఇలా కుటుంబ‌మంతా వేడుకల‌తో ఆనంద‌మ‌య జీవితాన్ని గ‌డ‌ప‌డం రెగ్యుల‌ర్ గా చూసేదే. గ‌చ్చిబౌళి ఫైనాన్షియ‌ల్ జిల్లా ప‌రిస‌రాల్లో సూప‌ర్ స్టార్ కృష్ణ నివ‌శించే ఫామ్ హౌస్ లో సెల‌బ్రేష‌న్స్ గురించి తెలిసిన‌దే. అలాగే సుధీర్ బాబు హైద‌రాబాద్ ఔట్ స్క‌ర్ట్స్ లోని ఓ తోట‌లో ఇండివిడ్యువ‌ల్ ఇంట్లో నివ‌సిస్తున్నారు. అలాగే కృష్ణ‌కు ఊటీలోనూ ఒక ఫామ్ హౌస్ ఉంది. మామిడి తోట‌లో ఆయన గెస్ట్ హౌస్ ఉంది. సుధీర్ బాబు వార‌సులు బాల‌న‌టులుగా రంగ ప్ర‌వేశం చేస్తారేమో వేచి చూడాలి.