Begin typing your search above and press return to search.
సుధీర్.. 24 గంటల్లో ఏం జరుగుతుంది?
By: Tupaki Desk | 11 Aug 2015 5:41 AM GMTసుధీర్ బాబు కెరీర్ కి ఓ భారీ హిట్ అవసరం. అతడు నటించిన ఎస్.ఎం.ఎస్, ప్రేమ కథా చిత్రం తర్వాత ఆశించిన స్థాయి విజయాలేవీ దక్కలేదు. అందుకే అతడు ఆచితూచి స్క్రిప్టుల్ని ఎంచుకుంటున్నాడు. కథలో కొత్తదనం, క్యారెక్టరైజేషన్ లో ఇంకేదైనా ప్రత్యేకత కోసం పరితపిస్తున్నాడిప్పుడు. ప్రస్తుతం అతడు 'భలే మంచి రోజు' చిత్రంలో నటిస్తున్నాడు. ఇదో క్రైమ్ స్టోరి. 24 గంటల లోపు ఏం జరిగింది? అన్నదే సినిమా. విశ్వరూపం, ఉత్తమ విలన్ చిత్రాలకు పనిచేసిన శ్యామ్ దత్ ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్ గా పనిచేస్తున్నారు. కెమెరా వర్క్ ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణ.
24 గంటల్లో జరిగే రకరకాల ఇన్సిడెంట్ లతో ఈ చిత్రం తెరకెక్కుతోంది. కాబట్టి థ్రిల్ ఎలిమెంట్ హైలైట్ గా ఉంటుందని సుధీర్ బాబు చెబుతున్నాడు. ఈ తరహాలో గతంలో బోలెడన్ని సినిమాలొచ్చాయి. జె.డి.చక్రవర్తి 'పాపకోసం' ఆ తరహా చిత్రమే. గ్రిప్పింగ్ స్క్రీన్‌ప్లే తో తెరకెక్కిన కాన్సెప్ట్ బేస్డ్ సినిమా ఇది. అలాగే నాగార్జున 'గగనం' సైతం 24గంటల్లో జరిగే స్టోరీనే. ఇటీవలి కాలంలో మరికొన్ని చిత్రాలు ఇదే తరహా కథాంశంతో వచ్చాయి. అయితే వాటన్నిటికంటే భలే మంచి రోజు డిఫరెంట్ స్క్రీన్‌ప్లే తో రాబోతోందని చిత్రయూనిట్ చెబుతోంది. 80శాతం చిత్రీకరణ పూర్తయింది. సుధీర్ బాబు ఫస్ట్ లుక్ ఇటీవలే ఆవిష్కరించారు.