Begin typing your search above and press return to search.

మహేష్ బావ చెప్పిన అసలు నిజం

By:  Tupaki Desk   |   4 Feb 2016 7:20 AM GMT
మహేష్ బావ చెప్పిన అసలు నిజం
X
ఆగడు - బ్రూస్ లీ వరుస ప్లాప్ ల తర్వాత దర్శకుడు శ్రీను వైట్ల ఇప్పుడు తనను తాను ప్రూవ్ చేసుకోవాల్సిన పరిస్థితిలో ఉన్నాడు. ఇందుకోసం స్టార్ హీరోలతో సహా అందరితోనూ చర్చలు జరుపుతున్నాడు. సూపర్ స్టార్ మహేష్ బాబుని కూడా ఇప్పటికే కలిశాడనే వార్తలున్నాయి. దీంతో మహేష్ ఓ ప్రాజెక్టుకు ఓకే చెప్పేశాడనే వార్తలొచ్చాయి.

అయితే మహేష్ హీరోగా కాదు, సూపర్ స్టార్ బావ సుధీర్ బాబు హీరోగా శ్రీనువైట్ల డైరెక్షన్ లో ఓ సినిమా రూపొందనుందని, దీన్ని మహేష్ స్వయంగా నిర్మించనున్నాడంటూ వార్తలు చక్కర్లు కొట్టాయి. కానీ అలాంటిదేం లేదంటూ అసలు సంగతి చెప్పేశాడు హీరో సుధీర్ బాబు. ఈ న్యూస్ పై ట్విట్టర్ లో స్పందించిన సుధీర్ 'మహేష్ నిర్మాణంలో శ్రీను వైట్ల దర్శకత్వంలో నేను హీరోగా ఓ సినిమా వస్తోందన్న వార్త అబద్ధం. భలే మంచి రోజు తర్వాత నేను ఏ తెలుగు సినిమాకు సైన్ చేయలేదు. ఇది జరగితే బాగుండని నేను కూడా అనుకుంటున్నా. అయితే అలాంటి డిస్కషన్స్ ఏవీ శ్రీను గారితో జరగలేదు. నేను సైన్ చేసిన వెంటనే నా ప్రాజెక్ట్ డీటైల్స్ ను త్వరలో ప్రకటిస్తాను' అంటూ ట్వీట్ చేశాడు సుధీర్ బాబు.

సాధారణంగా రూమర్స్ మొదలయ్యాక ఎప్పటికో గానీ మన హీరోలు స్పందించరు. కానీ మహేష్ బావ మాత్రం.. ఇలా పుకార్లు రాగానే అలా ఖండించేస్తూ.. అభిమానులకు మరింత దగ్గరవుతున్నాడు. వారిలో ఎలాంటి కన్ఫ్యూజన్ క్రియేట్ కాకుండా జాగ్రత్త పడుతున్నాడు. ప్రస్తుతం ఈ హీరో బాలీవుడ్ మూవీ బాఘీలో టైగర్ ష్రాఫ్ కు విలన్ గా నటిస్తున్నాడు.