Begin typing your search above and press return to search.
సుధీర్ బాబుకు చేదు జ్ఞాపకంగా వీర భోగ!
By: Tupaki Desk | 26 Oct 2018 9:40 AM GMTకల్ట్ మూవీ అని ప్రమోట్ చేసిన 'వీరభోగ వసంతరాయలు' సినిమా రిజల్ట్ ఆడియన్స్ కంటే మేకర్స్ నే ఎక్కువగా షాక్ కు గురిచేసింది. సినిమా రిలీజ్ డేట్ కు చాలా ముందే అమెరికాలో ప్రీమియర్ షోస్ వేయడం.. వాటికి నెగెటివ్ టాక్ రావడంతో తెలుగు రాష్ట్రాల సినిమా ఓపెనింగ్స్ పై ఇంపాక్ట్ పడింది. ఇదిలా ఉంటే హీరో సుధీర్ బాబు ఈ సినిమాలో కీలక పాత్ర పోషించినప్పటికీ డబ్బింగ్ చెప్పకవడం.. ప్రమోషన్స్ చేయకపోవడం ఒక హాట్ టాపిక్ గా మారిన విషయం తెలిసిందే.
ఇప్పుడు సినిమా ఇలా ఫ్లాప్ కావడం వల్ల సుధీర్ కు ఇదొక చేదు జ్ఞాపకంగా మారింది. ఏ హీరోకయినా ఒక సినిమాలో నటించిన తర్వాత రిలీజ్ టైంలో దూరంగా ఉండడం కాస్త ఇబ్బందికరమైన విషయమే. ఇదొక్కటే కాదు.. సుధీర్ కు ఈ సినిమా వల్ల డబల్ ఇంపాక్ట్ తగిలింది. అదేంటంటే ఈ సినిమాలో సుధీర్ బాబు తనయుడు చరిత్ మానస్ కూడా ఒక పాత్రలో నటించాడు. చరిత్ కు ఈ సినిమాలో చెప్పుకోదగ్గ స్క్రీన్ టైమ్ కూడా ఉంది. ఒకవేళ సినిమా కనుక విజయం సాధించి ఉంటే చరిత్ పాత్ర గురించి నలుగురు మాట్లాడుకునేవారు. కానీ ఇప్పుడు ఆ విషయం పూర్తిగా మరుగునపడిపోయింది.
ఈ సినిమా గురించి అసలు ట్విట్టర్ లో గానీ.. ఇతర ఇంటర్వ్యూలలో కానీ ఏమాత్రం ప్రస్తావించకపోవడం చూస్తుంటే ఫ్యూచర్ లో సినిమా సెలెక్షన్ విషయంలో ఒకటికి నాలుగుసార్లు అలోచించి గానీ నిర్ణయం తీసుకోడేమో.