Begin typing your search above and press return to search.

నెట్టింట వైరల్ అవుతున్న సుధీర్ బాబు ఫ్యామిలీ పిక్చర్..!

By:  Tupaki Desk   |   20 May 2021 10:00 AM IST
నెట్టింట వైరల్ అవుతున్న సుధీర్ బాబు ఫ్యామిలీ పిక్చర్..!
X
నటశేఖర కృష్ణ కుమార్తెని పెళ్లి చేసుకొని సూపర్ స్టార్ అల్లుడిగా మారిన సుధీర్ బాబు.. హీరోగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. 2006లో మహేష్ బాబు సోదరి ప్రియదర్శిని - సుధీర్ ల వివాహం జరిగింది. ఈ దంపతులకు చరిత్ మానస్ - దర్శన్ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. వీరిలో చరిత్ మానస్ ఇప్పటికే చైల్డ్ ఆర్టిస్టుగా ఎంట్రీ ఇచ్చాడు. సందర్భం వచ్చినప్పుడల్లా సోషల్ మీడియా ద్వారా సుధీర్ బాబు తన ఫ్యామిలీ విషయాలను షేర్ చేసుకుంటూ ఉంటారు. ఈ క్రమంలో తాజాగా వీరి ఫ్యామిలీ ఫొటో ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది.

ఇందులో సుధీర్ బాబు - ప్రియదర్శిని తో పాటుగా తమ ఇద్దరు కుమారులు ట్రెడిషనల్ దుస్తుల్లో దర్శనమిచ్చారు. ఈ ఫ్యామిలీ ఫొటోలో మరో మెంబెర్ గా తమ పెట్ డాగ్ కూడా యాడ్ అయింది. పర్ఫెక్ట్ ఫ్యామిలీ పిక్చర్ అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. కాగా, సూపర్ స్టార్ ఫ్యామిలీ నుంచి వచ్చినప్పటికీ, సుధీర్ ఆ బ్యాగ్రౌండ్ ని ఉపయోగించుకోకుండా కష్టపడుతూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకోడానికి ప్రయత్నిస్తున్నాడు. కెరీర్ స్టార్టింగ్ నుంచి కూడా కథాబలం ఉన్న కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలలో నటిస్తూ ప్రేక్షకులను మెప్పిస్తున్నాడు.

ప్రస్తుతం 'శ్రీదేవి సోడా సెంట‌ర్' అనే సినిమాలో హీరోగా నటిస్తున్నారు సుధీర్ బాబు. 'పలాస 1978' ఫేమ్ కరుణ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని సుధీర్ ఫ్రెండ్ విజయ్ చిల్లా నిర్మిస్తున్నారు. అలానే ఇంద్రగంటి మోహనకృష్ణతో 'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి' అనే సినిమా చేస్తున్నాడు. ఇది వీరి కాంబోలో వస్తున్న హ్యాట్రిక్ మూవీ. దీనికి సుధీర్‌ బాబు నిర్మాతగా కూడా వ్యవహరిస్తుండటం విశేషం. ప్రొఫెషనల్ బ్యాడ్మింటన్ ప్లేయర్ అయిన సుధీర్ బాబు.. ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు పుల్లెల గోపీచంద్ బయోపిక్ లో నటించనున్నారని తెలుస్తోంది.