Begin typing your search above and press return to search.
బావ కళ్లల్లో మెరుపంటున్న సుధీర్
By: Tupaki Desk | 22 Jun 2018 6:32 AM GMTబావ కళ్ళల్లో ఆనందం చూడటం కోసం అప్పట్లో మొద్దు శీను చెప్పిన మాట ఎంత పాపులరైందో తెలిసిందే. ఆ మాటను సినిమాల్లో కూడా చాలామంది వాడుకున్నారు. ఇప్పుడు ఈ తరహా మాటనే సుధీర్ బాబు వాడటం విశేషం. ‘సమ్మోహనం’ సినిమాలో తన పెర్ఫామెన్స్ చూసి తన బావ మహేష్ బాబు కళ్లల్లో మెరుపు కనిపిస్తోందని అతను చెప్పాడు. తనను మహేష్ బాబుకు చాలా దగ్గర చేసిన చిత్రమిదని.. ఈ సినిమా తర్వాత తనను చూసి మహేష్ గర్విస్తున్నాడని అతను చెప్పాడు. ‘సమ్మోహనం’ సక్సెస్ మీట్లో అతను ఈ మేరకు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఇంకా అతనేమన్నాడంటే..
‘‘సూపర్ స్టార్ ఫ్యామిలీ నుంచి వచ్చి సినిమా చేస్తున్నాడు కదా.. వీడేంటో అని సామాన్యులు దూరంగా ఉండిపోయారు. అలాంటి వాళ్లకు నన్ను దగ్గర చేసిన చిత్రం ‘సమ్మోహనం’. అలాగే నా బావ మహేష్ కు కూడా నన్ను ఈ చిత్రం దగ్గర చేసింది. ఇప్పుడు నా గురించి మాట్లాడేటప్పుడు బావ కళ్లలో మెరుపు కనిపిస్తోంది. నా కెరీర్‌లో తొలి విజయం ‘ప్రేమకథా చిత్రమ్’తో దక్కింది. ఆ తరవాత చాలా మంచి సినిమాలు చేశాను. కానీ నన్నందరూ ‘ప్రేమకథా చిత్రమ్’ సుధీర్ బాబుగానే చూశారు. కానీ ఇకపై ‘సమ్మోహనం’ సుధీర్ బాబు అంటారు. మహేశ్ బావగా నాకు దగ్గరే కానీ.. నటులుగా మా మధ్య చాలా గ్యాప్ ఉందనిపించేది. ఈ సినిమా ఓ నటుడిగా నన్ను తనకు దగ్గర చేసింది. ఈ సినిమాలో నరేష్ గారు నాకు తండ్రిగా నటించారు. ఆయన్ని నిజమైన నాన్నగానే భావించా. ఇంద్రగంటిగారు భాషను ప్రేమించేంతలా భార్యను కూడా ప్రేమించరు. అలాంటి గొప్ప దర్శకుడితో ఇంత మంచి సినిమా చేయడం నా అదృష్టం ’’ అని సుధీర్ చెప్పాడు.