Begin typing your search above and press return to search.
మిసెస్ మంచు లక్ష్మితో సమ్మోహనం స్టార్
By: Tupaki Desk | 8 March 2019 11:59 AM GMTఇప్పుడు డిజిటల్ ఎంటర్ టైన్ మెంట్ వచ్చాక వినోదాన్ని థియేటర్లోనే పొందాలని లేదు. దానికి సమాంతరంగా వెబ్ సిరీస్ కూడా మంచి భవిష్యత్తుని చూపిస్తోంది.అందుకే వెబ్ సిరీస్ డిజిటల్ సినిమా అంటూ రకరకాల పేర్లతో సినిమా హాల్ కు వెళ్లే వ్యయాన్ని తప్పించుకుని అమెజాన్ నెట్ ఫ్లిక్స్ లాంటి సంస్థలు స్మార్ట్ ఫోన్స్ ల్యాప్ టాప్స్ లోకి కోరుకున్న ఎంజాయ్ మెంట్ ని తెచ్చిస్తున్నారు. ఇవాళ మహిళా దినోత్సవం సందర్భంగా జీ 5 మిసెస్ సుబ్బలక్ష్మిని విడుదల చేసింది.
మంచు లక్ష్మి టైటిల్ రోల్ లో అవసరాల శ్రీనివాస్ తనకు జంటగా వంశీ కృష్ణ డైరెక్షన్ లో ఇది రూపొందింది. మొత్తం పది ఎపిసోడ్లు కలిపి టైటిల్స్ ఎండ్ క్రెడిట్స్ మినహాయించి 3 గంటల 30 నిమిషాల నిడివి ఉన్న మిసెస్ మహాలక్ష్మిలో మరో ప్రత్యేక ఆకర్షణ ఉంది. అదే సుధీర్ బాబు క్యామియో. ట్రైలర్ లో చూపించలేదు కానీ చివరి ఎపిసోడ్ లో హోమ్ మినిస్టర్ పాత్రలో అలా వచ్చి వెళ్తాడు.కథానుసారం కొన్ని కీలకమైన సన్నవేశాలు సుధీర్ మీద ఉన్నాయి.
పెళ్లయ్యాక భర్త తనను నిర్లక్ష్యం చేస్తున్నాడని భావించిన ఓ పెళ్ళైన యువతీ ఎవరికి చెప్పకుండా బయటికి వెళ్ళిపోయి స్వతంత్రంగా ఎంజాయ్ చేస్తూ డైమండ్ స్మగ్లింగ్ ముఠా చేతుల్లో చిక్కుకోవడం ఆ తర్వాత ఆ ఉచ్చులో నుంచి ఎలా తప్పించుకుని భర్తా పిల్లలను చేరుకుంది అనే కాన్సెప్ట్ మీద ఇది రూపొందించారు. ఎలా ఉంది అనే విషయం తర్వాత మాట్లాడుకుందాం కాని సినిమాలకే పరిమితమైన క్యామియోలు ఇప్పుడు వెబ్ సిరీస్ లకు కూడా వచ్చేశాయన్న మాట