Begin typing your search above and press return to search.
పిక్ టాక్: సిక్స్ ప్యాక్ కార్మికుడిగా సూపర్ స్టార్ అల్లుడు..!
By: Tupaki Desk | 1 May 2021 1:04 PM ISTసూపర్ స్టార్ ఫ్యామిలీ నుంచి హీరోగా ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చిన సుధీర్ బాబు.. కథాబలం ఉన్న సినిమాలు చేస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. సినిమాలో కోసం ఎంత రిస్క్ అయినా తీసుకునే సుధీర్.. తన పాత్ర కోసం శక్తినంతా ధార పోస్తుంటారు. కఠినమైన వర్కౌట్స్ చేస్తూ పర్ఫెక్ట్ ఫిజిక్ ని మెయింటైన్ చేస్తూ వస్తున్నాడు. 'భాగీ' సినిమాలో తన బాడీని శాంపిల్ గా చూపించి.. 'వి' సినిమాలో కండలు తిరిగిన ఆరు పలకల దేహంతో విశ్వరూపం చూపించాడు. ఈరోజు కార్మికుల దినోత్సవం సందర్భంగా స్పెషల్ పోస్టర్ ద్వారా మరోసారి తన యాబ్స్ ని చూపించాడు.
'ప్రపంచవ్యాప్తంగా కార్మిక వర్గానికి సెల్యూట్..!! మనందరం ఒకరికొకరం' అంటూ సోషల్ మీడియా ద్వారా మే డే శుభాకాంక్షలు తెలియజేశారు సుధీర్ బాబు. ఈ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్ లో ఆయన సిక్స్ ప్యాక్ లుక్ వావ్ అనేలా ఉంది. బొగ్గు గనుల్లో పని చేసే కార్మికుడిగా టోపీ మరియు పనిముట్లు పట్టుకుని నిలబడ్డాడు. డిఫరెంట్ హెయిర్ స్టైల్ - గడ్డం మీసాలతో ఉన్న సుధీర్ ఫోటో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. ఇక సినిమాల విషయానికొస్తే సుధీర్ ప్రస్తుతం 'శ్రీదేవి సోడా సెంటర్' అనే సినిమా చేస్తున్నాడు. 'పలాస 1978' ఫేమ్ కరుణ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని సుధీర్ ఫ్రెండ్ విజయ్ చిల్లా నిర్మిస్తున్నారు. అలానే ఇంద్రగంటి మోహనకృష్ణతో 'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి' అనే సినిమా చేస్తున్నాడు. దీనికి సుధీర్ బాబు నిర్మాతగా కూడా వ్యవహరిస్తుండటం విశేషం.