Begin typing your search above and press return to search.
టైటానిక్ డికా ప్రియోలా మారాడు
By: Tupaki Desk | 12 May 2019 11:36 AM ISTఈ ఫోటోలో యంగ్ హీరోని గుర్తు పట్టగలరా? ఇంతలోనే ఎంత మారిపోయాడు. నిన్న గాక మొన్న చూసిన ఆ కుర్రాడు ఈ కుర్రాడేనా? అన్నంతగా మారిపోయి నిజంగానే అభిమానులకు బిగ్ షాక్ ఇస్తున్నాడు. సినిమా కోసం మారినా అతడిలో అమాంతం వచ్చిన ఈ మార్పు ఊహాతీతమైనది. ఈ మేకోవర్ కి హ్యాట్సాఫ్ చెప్పాలి. అసలు సుధీర్ బాబు కెరీర్ ఆరంభంతో పోలిస్తే ఇప్పటి ఈ మార్పు ఎంతో ఇంప్రెస్సివ్ అని పొగిడేయాలి. ప్రతి సినిమాకి అతడిలో ఎంతో మార్పు అయితే కనిపిస్తోంది. నటన పరంగా.. డైలాగ్ డెలివరీ పరంగా పరిణతి అంతే ఇదిగా ఉంటోందని బావ మహేష్ అంతటివాడే కీర్తిస్తున్నాడు.
సినిమావోళ్లు ఏదైనా చేస్తారు లే అని అనుకోకపోతే ఈ మార్పు కోసం సుధీర్ బాబు తొలి నుంచి చేస్తున్న హార్డ్ వర్క్ చూస్తే మతి చెడుతుంది. ఆరంగేట్రమే అతడు ఒక జిమ్నాస్టిక్ గా పరిచయం అయ్యాడు. ఓ లైవ్ వేదికపైనే గగుర్పొడిచే విన్యాసాలతో అలరించాడు. తనలోని ఫ్యాషన్ ని చెప్పకనే చెప్పాడు. అది బాలీవుడ్ లో భాఘి 2లో నటించే అవకాశమే ఇచ్చింది. ఇటు తెలుగు సినిమాలు చేస్తూనే అతడు బాలీవుడ్ లో ఆ ఒక్క చిత్రంతో పాపులారిటీ తెచ్చుకున్నాడు. తెలుగులో హీరోగా నెగ్గాలన్న పంతంతో అటు వెళ్లడం లేదు కానీ బాలీవుడ్ లో అతడికి ఈపాటికే రకరకాల క్యారెక్టర్లతో రెడ్ కార్పెట్ వేసేవారే. కానీ సుధీర్ బాబు టాలీవుడ్ లో నిరూపించుకోవాలన్న కసితో ఉన్నాడు. ఇక్కడ జర్నీ సాఫీగా సాగించేందుకు అవసరమయ్యే అన్ని ఎత్తుగడల్ని వేస్తున్నాడు. బావ మహేష్ నింపిన స్ఫూర్తితో తనని తాను హీరోగా.. సూపర్ హీరోగా మలుచుకునే ప్రయత్నంలోనే ఉన్నాడు. అందుకోసం కఠోరంగానే శ్రమిస్తున్నాడు. ఫిజికల్ అప్పియరెన్స్ .. స్టోరి ఛూజింగ్ లో రాటు దేలుతున్నాడు.
తనకు హిట్లిచ్చిన దర్శకులతో రెగ్యులర్ గా టచ్ లో ఉండి సినిమాలు చేస్తున్నాడు. ప్రస్తుతం సమ్మోహనం డైరెక్టర్ ఇంద్రగంటి మోహన్ కృష్ణతో కలిసి అతడు వీ అనే మల్టీస్టారర్ లో నటిస్తున్న సంగతి తెలిసిందే. నేచురల్ స్టార్ నాని ఈ చిత్రంలో నెగెటివ్ షేడ్ ఉన్న పాత్రలో నటిస్తున్నాడు. నిన్నటి రోజున ఇంద్రగంటి అండ్ టీమ్ తో కలిసి సుధీర్ బాబు తన బర్త్ డే వేడుకల్ని జరుపుకున్నాడు. ఈ వేడుకల్లో అతడి మేకోవర్ చూస్తే బిగ్ షాక్ ఇచ్చింది.
లుక్ పరంగా సన్నగా ట్రిమ్ అయ్యాడు.. హెయిర్ కట్ మునుపటి కంటే స్పార్క్ గా ఉంది. ముఖవర్చస్సు కూడా ఇంప్రెస్సివ్ గా ఛేంజ్ అయ్యింది. హాలీవుడ్ స్మార్ట్ బోయ్.. టైటానిక్ డికా ప్రియోలా తలకట్టు మార్చి కాస్త అటూ ఇటూగా కనిపిస్తున్నాడు. ఇంతకీ సుధీర్ బాబు షాకింగ్ మేకోవర్ ఏ సినిమా కోసం? వీ లో కాప్ లుక్ కోసమేనా? లేక పుల్లెల గోపిచంద్ బయోపిక్ కోసం అనూహ్య మార్పునా? అన్నది తనే చెప్పాలి. బర్త్ డే వేళ సర్ ప్రైజ్ లుక్.. ఇంప్రెస్సివ్. ఇంద్రగంటి టీమ్ తో సెలబ్రేషన్స్ అంతే బావున్నాయిలే..