Begin typing your search above and press return to search.
దోచుకోవడానికి తీయని పాట్లు!!
By: Tupaki Desk | 18 Sep 2018 6:00 AM GMTతనకంటూ ఒక ఉనికిని ఏర్పరుచుకోవడానికి బాగా కష్టపడుతున్న హీరో సుధీర్ బాబు కొత్త సినిమా నన్ను దోచుకుందువటే ఈ నెల 21న విడుదల కానున్న సంగతి తెలిసిందే. ముందు 14 అనుకున్నప్పటికీ చైతు సామ్ లతో పోటీ ఎందుకు అనుకుని వారం వాయిదా వేసుకుని మంచి పనే చేసారు. ఇప్పుడు దీనికి ప్రమోషన్స్ ఫుల్ స్వింగ్ లో ఉన్నాయి. సుధీర్ బాబు రెండు వారాల ముందు నుంచే ఇంజనీరింగ్ కాలేజీలు చుట్టేస్తూ ఈ సినిమా టార్గెట్ చేసిన యూత్ ని ఆకర్షించే పనిలో ఉన్నాడు. ఇక ఇలాంటి వాటికి బలంగా నిలిచే ఓవర్ సీస్ మార్కెట్ లో కూడా ఓ స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నాలు గట్టిగానే జరుగుతున్నాయి. అక్కడ హక్కులు తీసుకున్న ఒక సంస్థ తాజాగా హూ స్టోల్ మై హార్ట్ పేరుతో ఒక కాంటెస్ట్ లాంచ్ చేసింది. దీని ప్రకారం నిజజీవితంలో తమ హృదయాలను దోచుకున్న వాళ్ళ గురించి ఆ జ్ఞాపకాల గురించి సోషల్ మీడియాలో సినిమాకు సంబంధించి సదరు డిస్ట్రిబ్యూటర్ కు సంబంధించి యాష్ ట్యాగ్ లను జత చేస్తే అందులో బెస్ట్ అనిపించిన వాళ్లను సెలెక్ట్ చేసి విజేతలుగా ప్రకటిస్తారు.
ఇంతా చేసి సుధీర్ బాబు అండ్ టీమ్ తో లంచో లేదా ఎక్కడికైనా ట్రిప్ అనో ఆశించకండి. పది మంది విన్నర్లుగా ఎంచుకుని చెరో రెండు ప్రీమియర్ షో టికెట్లు కానుకగా ఇస్తారట. ఆ పేర్లు 20న సుధీర్ బాబు తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా ప్రకటిస్తాడు. బాగుంది. సుధీర్ బాబు సినిమా మొదటి ఆట చూసేందుకు ఇంత కష్టపడాలా అని అడిగే వారు లేకపోలేదు. ఓపెనింగ్స్ కోసం చేస్తున్న కసరత్తు కాబట్టి ఏదో ఒకటి చేసి ప్రేక్షకులను ఆకట్టుకోవాలి. పైగా ఎంత మంచి టాక్ వచ్చినా ఎందరు సపోర్ట్ చేసినా సమ్మోహనం పది కోట్ల మార్కెట్ చేరుకోవడానికి చెమటలు చిందించింది. సో నన్ను దోచుకుందువటేకు అంత కన్నా బెటర్ టాక్ రావడం ముఖ్యం. అది బాగా వస్తేనే సేఫ్ అవుతుంది. పబ్లిసిటీ కోసం ఇలాంటి పాట్లు పడటం అందరూ చేసేదే కానీ కేవలం ప్రీమియర్ షో టికెట్లు ప్రైజ్ గా పెడితే ఎన్ ఆర్ ఐ ప్రేక్షకులు ఎగబడతారా. మహేష్ బాబు అయితే ఖచ్చితంగా చేసేవారు కానీ సుధీర్ బాబు కదా అంత రెస్పాన్స్ వస్తుందో రాదో చూడాలి. అవతల అదే రోజు విక్రమ్ ఊర మాస్ పోలీస్ అవతారంతో సామీ స్క్వేర్ అంటూ పోటీకి సై అంటున్నాడు. ఓపెనింగ్స్ దోచుకోవడం అంత సులభంగా అయితే ఉండబోవడం లేదు.