Begin typing your search above and press return to search.
మళ్ళి సమ్మోహన పరచగలడా?
By: Tupaki Desk | 4 Aug 2018 11:48 AM GMTసూపర్ స్టార్ కృష్ణ ఫ్యామిలీ హీరోగా అడుగు పెట్టిన సుధీర్ బాబు కెరీర్ స్లోగానే వెళ్తోంది. ఇటీవలే వచ్చిన సమ్మోహనం మంచి పేరు తెచ్చుకోవడంతో పాటు సుధీర్ లోని కంప్లీట్ యాక్టర్ ని బయటికి తీసుకొచ్చింది. కాకపోతే అన్ని వర్గాలను టార్గెట్ చేసిన సినిమా కాకపోవడంతో వసూళ్ల పరంగా మరీ అద్భుతాలు సృష్టించలేకపోయింది. ఇప్పుడు రాబోతున్న నన్ను దోచుకుందువటే కూడా అదే కోవలో సాఫ్ట్ లవ్ స్టోరీ గా ట్రైలర్ తో ఓ మాదిరి అంచనాలు తీసుకొచ్చింది. డెబ్యూ దర్శకుడు ఆర్ ఎస్ నాయుడు తీసిన ఈ మూవీపై ఇప్పుడు హైప్ లేదు కానీ విడుదల టైంకి వచ్చేస్తుంది. ఇది నిర్మాతగా కూడా సుధీర్ బాబు మొదటి సినిమా. ఆ రకంగా కొత్త బాధ్యతలు మోస్తున్న సుధీర్ అన్ని రకాల జాగ్రత్తలు తీసుకునే ఉంటాడు. నన్ను దోచుకుందువటే టైటిల్ ని బట్టే ఎలాంటి జానరో చెప్పేసారు కాబట్టి ఆ టార్గెట్ ఆడియన్స్ మెప్పించినా మరో హిట్ ఖాతాలో పడిపోతుంది.
మహేష్ బాబు అండదండలు ప్రతిసారి తాను కోరుకోవడం లేదని చెప్పిన సుధీర్ దానికి తగ్గట్టే కథల ఎంపికలో జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. తన మార్కెట్ రేంజ్ ఏంటో స్పష్టమైన అవగాహనతో ఆ లోపు బడ్జెట్ పరిమితుల మధ్యే సినిమాలు చేస్తున్నాడు. హిందీలో నెగటివ్ షేడ్స్ లో భాగీ మంచి పేరు తీసుకొచ్చినా తర్వాత వచ్చిన ఆఫర్స్ ని రిజెక్ట్ చేసిన సుధీర్ తెలుగులోనే సెటిల్ అవ్వాలనే ప్లాన్ లో ఉన్నాడు. పరిశ్రమకు వచ్చి ఎనిమిదేళ్లు అవుతున్నా సోలో హీరోగా సుధీర్ చేసింది ఏడు సినిమాలే. మిగిలిన రెండు మూడు క్యామియోల రూపంలో నటించినవి. సో సాలిడ్ హిట్లు ఓ రెండు మూడు పడితే తప్ప కెరీర్ పికప్ కాదు. మరి నన్ను దోచుకుందువటే అంచనాలకు తగ్గట్టు ఉంటే మరొక విజయం ఖాతాలో పడుతుంది. చూడాలి ఎంత వరకు నెగ్గుతాడో. నభ నటేష్ హీరోయిన్ గా పరిచయమవుతున్న ఈ మూవీకి సంగీతం అజనీష్. ఈ నెల మూడో వారం లేదా నెలాఖరుకు విడుదల చేసే ప్లాన్ లో ఉంది యూనిట్.