Begin typing your search above and press return to search.

ఏంటీ సుధీర్.. అగ్ని జ‌మ‌ద‌గ్నిలా ఆ ఫోజు?

By:  Tupaki Desk   |   27 Dec 2021 4:00 PM IST
ఏంటీ సుధీర్.. అగ్ని జ‌మ‌ద‌గ్నిలా ఆ ఫోజు?
X
వీ ఫ్లాపైనా శ్రీ‌దేవి సోడా సెంట‌ర్ స‌క్సెసై రిలీఫ్ నిచ్చింది. ఈ రెండు చిత్రాల్లో సుధీర్ బాబు న‌ట‌న‌కు చ‌క్క‌ని పేరొచ్చింది. మునుముందు త‌న స్టార్ డ‌మ్ ని విస్త‌రించే ప‌నిలో సుధీర్ బాబు బిజీగా ఉన్నాడు. అత‌డు న‌టిస్తున్న 15వ చిత్రం హైదరాబాద్ లో పూజా కార్యక్రమాలతో ఇటీవ‌ల‌ లాంఛనంగా ప్రారంభమైంది. ఇంకా పేరు పెట్టని ఈ ప్రాజెక్ట్ కి ర‌చ‌యిత కం న‌టుడు హర్షవర్ధన్ దర్శకత్వం వహిస్తుండగా శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్‌.ఎల్‌.పి బ్యానర్ పై నారాయణ్ దాస్ కె నారంగ్ ..పుస్కుర్ రామ్ మోహన్ రావు సంయుక్తంగా దీనిని నిర్మించనున్నారు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమైంది.

తాజాగా రెగ్యుల‌ర్ షూట్ లో భాగంగా సుధీర్ బాబు బ్యాక్ ఫీట్ ఫోటోగ్రాఫ్ ని చిత్ర‌బృందం షేర్ చేసింది. ఈ ఫోటోగ్రాఫ్ లో సుధీర్ బాబు ప‌క్క పాపాడి రింగుల జుత్తుతో కాస్త ఓల్డ్ క్లాసిక్ సూప‌ర్ స్టార్ స్టైల్ ని గుర్తు చేస్తున్నాడు. ఆ త‌ల‌క‌ట్టు చూస్తుంటే నాటి రోజుల్లో సూప‌ర్ స్టార్ కృష్ణ‌నే త‌ల‌పిస్తోంది. అలా చార‌ల చొక్కాయ్ తొడిగి పూల‌దండ‌ను వెన‌క్కి వేసాడు.

హుందాగా స్మైలిస్తున్నాడు..! దీంతో అభిమానులు అగ్ని జ‌మ‌ద‌గ్ని అంటూ స‌ర‌దాగా కామెంట్లు చేస్తున్నారు. ఇదేమైనా కృష్ణ సినిమాకి రీమేక్ కాదు క‌దా? అని సందేహాలు వ‌స్తున్నాయి. ఇక త‌న‌ని షూట్ చేస్తూ సినిమాటోగ్రాఫ‌ర్ పీజీ విందా త‌న ప‌నిలో తాను బిజీగా ఉన్నాడు. ఒక్క ఫోటోగ్రాఫ్ తో సుధీర్ బాబు బోలెడ‌న్ని సందేహాలు రేకెత్తించాడు. ఈ సినిమా కథాకమామీషు ఏమిట‌న్న‌ది త్వ‌ర‌లోనే తెలుస్తుందేమో చూడాలి.

చైతన్ భరద్వాజ్ సంగీతం సమకూరుస్తుండగా.. సీనియ‌ర్ అయిన‌ పీజీ విందా సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. రాజీవ్ ఆర్ట్ డైరెక్టర్ గా కొన‌సాగుతున‌నారు. మిగిలిన నటీనటులు సాంకేతిక నిపుణుల గురించి పూర్తి వివరాలను మేకర్స్ త్వరలో వెల్లడించ‌నున్నారు. ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి... పుల్లెల గోపిచంద్ బ‌యోపిక్ లోనూ సుధీర్ బాబు న‌టిస్తున్న సంగతి తెలిసిందే.