Begin typing your search above and press return to search.
స్మార్ట్ గా ఆలోచించిన సుధీర్ బాబు
By: Tupaki Desk | 2 Sep 2018 6:39 AM GMTమంచి స్టొరీ ని ఎంచుకోవడమే కాదు సరైన రిలీజ్ డేట్ ను లాక్ చేయడం కూడా ఒక సినిమా సక్సెస్ లో కీలకపాత్ర పోషిస్తుంది. హిట్ కావాల్సిన చాలా సినిమాలు బ్రేక్ ఈవెన్ కు బెత్తెడు దూరంలో ఆగిపోవడానికి రాంగ్ రిలీజ్ డేట్ కూడా ఒక కారణం. అదే సరైన టైమింగ్ తో రిలీజ్ చేస్తే యావరేజ్ సినిమా కూడా సూపర్ హిట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇలాంటివి చాలా అనుభవం ఉంటే కాని తెలిసిరావు. కానీ హీరో సుధీర్ బాబు మాత్రం తక్కువ అనుభవంతోనే తెలివైన నిర్ణయాలు తీసుకుంటున్నాడు.. ఎలా అంటారా?
సుధీర్ తాజా చిత్రం 'నన్ను దోచుకుందువటే' వినాయక చవితి పండగ సందర్భంగా రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు. కానీ అనుకోకుండా అదే డేట్ కు 'శైలజారెడ్డి అల్లుడు' రిలీజ్ డేట్ ప్రకటించారు. షెడ్యూల్ ప్రకారమైతే 'శైలజారెడ్డి అల్లుడు' ఆగష్టు 31 న రిలీజ్ కావలసి ఉంది. అనివార్యకారణాల వల్ల సినిమాను సెప్టెంబర్ 13 కు వాయిదా వేశారు. దీంతో సుధీర్ బాబు సినిమాకు పెద్ద పోటీ అయింది. మారుతి లాంటి డైరెక్టర్ - నాగ చైతన్య- అను ఇమ్మాన్యుయేల్ - రమ్యకృష్ణ లాంటి లీడ్ ఆర్టిస్ట్స్ తో 'శైలజారెడ్డి అల్లుడు' సినిమాకు ఇప్పటికే మంచి బజ్ ఉంది ఈ సినిమా హిట్ టాక్ వస్తే సుధీర్ బాబు సినిమా కాంపిటీషన్ లో నష్టపోయే అవకాశం ఉంది. పైగా ఈ సినిమాకు సుధీర్ నిర్మాత కూడా. దీంతో 'నన్ను దోచుకుందువటే' రిలీజ్ డేట్ ను సెప్టెంబర్ 21 కి మార్చారు.
ఎలాగూ తక్కువ బడ్జెట్ లో నిర్మించిన సినిమానే కాబట్టి పాజిటివ్ టాక్ వస్తే బ్రేక్ ఈవెన్ కావడం సులువే. ఈగోకు పోకుండా సుధీర్ బాబు తమ సినిమాను వారం వాయిదా వేయడం తెలివైన పనేనని ప్రశంసిస్తున్నారు.