Begin typing your search above and press return to search.
మొదట నో చెప్పి తర్వాత స్వయంగా నిర్మించాడు
By: Tupaki Desk | 14 Sep 2018 3:30 PM GMT‘సమ్మోహనం’ చిత్రంతో చాలా కాలంకు ఒక మంచి కమర్షియల్ సక్సెస్‌ను దక్కించుకున్న హీరో సుధీర్ బాబు తాజాగా ‘నన్ను దోచుకుందువటే’ అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దం అయ్యాడు. మొదట ఈ చిత్రంను వినాయక చవితి శుభాకాంక్షలతో నిన్న విడుదల చేయాలని భావించారు. కాని అదే రోజు చైతూ మరియు సమంతల సినిమాలు విడుదలైన కారణంగా వారం ఆలస్యంగా విడుదలకు నిర్ణయించుకున్నట్లుగా సమాచారం అందుతుంది. ఈనెల 21న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్రంపై సుధీర్ బాబు చాలా నమ్మకంగా ఉన్నాడు.
ఇటీవలే ఈ చిత్రం ట్రైలర్ ను బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్ చేతుల మీదుగా విడుదల చేయించిన విషయం తెల్సిందే. ట్రైలర్‌కు మహేష్ బాబు నుండి పాజిటివ్ టాక్ దక్కింది. ఈ చిత్రంతో సుధీర్ బాబు ప్రొడక్షన్స్ లోకి ఎంటర్ కాబోతున్నాడు. ఎస్ బి ప్రొడక్షన్స్ లో సుధీర్ బాబు ఈ చిత్రంను నిర్మించాడు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఈ చిత్రం ఎలా ప్రారంభం అయ్యింది అనే విషయాన్ని సుధీర్ బాబు చెప్పుకొచ్చాడు. ఈ చిత్రం కథను సుధీర్ బాబు మొదట తిరష్కరించాడట, ఆ తర్వాత మళ్లీ అదే కథను నటించడమే కాకుండా స్వయంగా నిర్మించేందుకు ముందుకు వచ్చాడట.
సుధీర్ బాబు మాట్లాడుతూ.. ఆర్ ఎస్ నాయుడు తన వద్దకు వచ్చి ఒక స్టోరీ లైన్ చెప్పాడు. అప్పుడు ఆ స్టోరీ లైన్ నాకు నచ్చలేదు. కొన్నాళ్ల తర్వాత అదే స్టోరీని పూర్తి స్థాయి స్క్రిప్ట్ గా మార్చడం జరిగింది. ఆ స్క్రిప్ట్ చదివిన నాకు బాగా నచ్చింది. కొత్త దర్శకులు స్టోరీ లైన్ చెప్పినప్పుడు జడ్జ్ చేయలేమని, వారి ట్యాలెంట్ స్క్రిప్ట్ ను బట్టి తెలుస్తుందని సుధీర్ బాబు అన్నాడు. ఈ చిత్రంతో తనకు డబ్బులు వచ్చినా రాకున్నా కూడా మంచి రివ్యూలు అయితే వస్తాయన్న నమ్మకం ఉందని, తప్పకుండా ఒక మంచి సినిమాను చేశాను అనే సంతృప్తి ఉందంటూ సుధీర్ బాబు పేర్కొన్నాడు.