Begin typing your search above and press return to search.

మహేష్ మేనల్లుళ్లకి.. కొట్టడం నచ్చలేదు

By:  Tupaki Desk   |   17 May 2016 10:30 PM GMT
మహేష్ మేనల్లుళ్లకి.. కొట్టడం నచ్చలేదు
X
సూపర్ స్టార్ మహేష్ బాబుకి బావగా ఇండస్ట్రీలో అడుగు పెట్టిన సుధీర్ బాబు.. ఇప్పుడు తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను సొంతం చేసుకున్నాడు. బాలీవుడ్ లో విలన్ గా అడుగుపెట్టి, అరంగేట్రంలోనే బాఘీ సక్సెస్ తో దూసుకుపోతున్నాడు ఈ టాలీవుడ్ హీరో. సుధీర్ బాబుకి ఇక్కడ విలన్లను చితక్కొట్టిన కేరక్టర్ చేసి.. అక్కడికెళ్లి తన్నులు తినాల్సి వచ్చింది.

ఇది తనకు కొత్త ఎక్స్ పీరియన్స్ అయినా.. పిల్లలు మాత్రం తమ తండ్రిని కొడుతుంటే తట్టుకోలేకపోయారని అంటున్నాడు. తన వరకూ వస్తే పాజిటివ్ - నెగిటివ్.. ఏ కేరక్టర్ అయినా ఎలా చేశానన్నదే పాయింట్ అయినా.. పిల్లలు మాత్రం చూడలేకపోయినట్లు చెప్పాడు సుధీర్ బాబు. అయితే.. ఎటువంటి రిప్రజెంటేషన్స్, రికమెండేషన్స్ లాంటివి లేకుండా.. తనకు తానుగా ఈ ఆఫర్ దక్కించుకుని, ఇప్పుడు విజయం సాధించడంతో.. భార్య సంతోషించినట్లు చెబుతున్నాడీ హీరో కం విలన్.

"నా పిల్లలు ఇద్దరు కుమారులు వారి స్నేహితుల మధ్య బోలెడన్ని మాటలు జరిగినట్లు చెబుతున్నారు. వారి ఫ్రెండ్స్ లో తోటి హీరోల పిల్లలు కూడా ఉన్నారు. నేను దెబ్బలు తిన్నట్లుగా నటించడం వారికి నచ్చదు. అయితే ఈ కేరక్టర్ విషయంలో నేను చాలా సంతోషంగా ఉన్నాను. బాఘీ ఆడిషన్ కి వెళ్లినపుడు ఇద్దరు సూపర్ స్టార్ ల కుటుంబం నుంచి వచ్చిన విషయం కూడా బాఘీ యూనిట్ కి తెలియదు" అంటున్నాడు సుధీర్ బాబు.