Begin typing your search above and press return to search.
మహేష్ బావ.. హాలీవుడ్ మూవీలా ఉందనే
By: Tupaki Desk | 20 April 2016 4:39 AM GMTసూపర్ స్టార్ మహేష్ బాబుకు బావగా టాలీవుడ్ లో అడుగు పెట్టిన సుధీర్ బాబుకి.. ఇక్కడ క్రేజ్ బాగానే ఉంది. ఒక్క ఛాన్స్ వస్తే సుధీర్ స్టార్ అయిపోతాడని మహేష్ స్వయంగా అన్నాడంటే.. ఈ హీరోపై ఎక్స్ పెక్టేషన్స్ ఏ రేంజ్ లో ఉన్నాయో అర్ధమవుతుంది. తెలుగుతోపాటు సౌత్ లోని మరికొన్ని భాషల నుంచి ఆఫర్స్ వస్తున్న సమయంలో.. సడెన్ గా బాలీవుడ్ మూవీలో విలన్ రోల్ చేస్తున్నట్లు చెప్పి ఆశ్చర్యపరిచాడు సుధీర్.
'నాకు బాలీవుడ్ కి వెళ్లాలనే కోరిక మొదటి నుంచి లేదు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎదగడానికి చాలానే అవకాశాలు ఉన్నాయి. అందుకే మొదట బాఘీ ఆఫర్ ని తిరస్కరించాను. అయితే, స్టోరీ విన్నాక నేను ఈ రోల్ తప్పనిసరిగా చేయాలని అనిపించింది. ఇంత పెద్ద బ్యానర్ లో చేసే అవకాశం మళ్లీ మళ్లీ వచ్చేది కాదు కదా' అంటున్నాడు సుధీర్ బాబు.
స్క్రిప్ట్ విన్న తరువాత ఇది బాలీవుడ్ మూవీలా అనిపించలేదని, ఓ హాలీవుడ్ మూవీ చేయబోతున్నట్లు ఫీలింగ్ కలిగిందంటున్న సుధీర్.. బాఘీ ఆ స్థాయిలోనే ఆడియన్స్ ని ఆకట్టుకుంటుందని చెబుతున్నాడు. తొలి సినిమాతో విలన్ గా బాలీవుడ్ పరిచయం కావడంతో.. తను ఏ స్థాయిలో పెర్ఫామెన్స్ ఇవ్వగలడో నిరూపించుకునేందుకు ఆస్కారం దక్కిందంటున్నాడు మహేష్ బావ.