Begin typing your search above and press return to search.
భలే కలిసొచ్చింది బాసూ
By: Tupaki Desk | 29 Dec 2015 5:30 PM GMTఈ వారం రిలీజ్ అయిన సినిమాల్లో భలే మంచి రోజు చిత్రానికి మాత్రమే మంచి టాక్ వచ్చింది. డిఫరెంట్ కాన్సెప్ట్ ని, విభిన్నంగా రూపొందించిన డైరెక్టర్ శ్రీరామ్ ఆదిత్య.. ప్రేక్షకుల మెప్పు పొందడంలో సక్సెస్ అయ్యాడు. రిలీజ్ కి ముందునుంచే ఉన్న అంచనాలు, ట్రైలర్ కు పాజిటివ్ రెస్పాన్స్ ఉండడం, మొదటి షో నుంచే బాగుందన్న మౌత్ టాక్.. వెరసి భలే మంచి రోజును సక్సెస్ ట్రాక్ లోకి తెచ్చాయి.
మరోవైవు క్రిస్మస్ సందర్భంగా రిలీజ్ అయిన మిగిలిన సినిమాలన్నీ ఢమాల్ అన్నాయి. గోపీచంద్ నటించిన సౌఖ్యం రొటీన్ అనిపించుకుంది. మోహన్ బాబు - అల్లరి నరేష్ చేసిన మామ మంచు అల్లుడు కంచు చిత్రం అరిగిపోయిన దశాబ్దాల నాటి ట్రీట్ మెంట్ తో పాతమూస ధోరణితో ఉంది. ఇక వారాహి సమర్పించిన జత కలిసే కూడా ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. వీటన్నిటికీ బ్యాడ్ టాక్ రావడం.. భలే మంచి రోజు చిత్రానికి ప్లస్ అయింది. మూవీ లవర్స్ కి ఇదొక్కటే ఆప్షన్ గా మిగలడంతో.. థియేటర్స్, కలెక్షన్స్ కూడా పెరుగుతున్నాయి.
మరోవైపు ఈ మూవీకి టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా అండగా నిలుస్తున్నాడు. మంచి రివ్యూలు వచ్చాయని, హ్యాపీగా ఉందని, ఇండియాకి రాగానే తప్పనిసరిగా భలేమంచి రోజు చూస్తానని ట్వీట్ చేశాడు మహేష్. ప్రస్తుతం కుటుంబంతో కలిసి దుబాయ్ టూర్ లో ఉన్నా.. తన బావ సుధీర్ బాబు చిత్రానికి ప్రచారం చేసిపెడుతున్నాడు. ఇవన్నీ కలిసి.. భలే మంచి రోజు చిత్రాన్ని హిట్ చేసేశాయని చెప్పచ్చు.