Begin typing your search above and press return to search.
మహేష్ చెప్పిన ఆ రోజు.. వచ్చేసిందా?
By: Tupaki Desk | 24 Dec 2015 5:30 PM GMTసూపర్ స్టార్ మహేష్ బాబు తన బావ సుధీర్ సత్తా ఎంతో చెప్పడానికి ఓ మాట అన్నాడు. ఒక కరెక్ట్ హిట్ పడితే సుధీర్ బాబు స్టార్ అయిపోతాడని మహేష్ ఉవాచ. మరి ఆ ఒక్క హిట్ పడే రోజు కోసం.. భలే మంచి రోజు చేశాడు. డిఫరెంట్ జోనర్స్ లో సినిమాలు చేసుకుంటూ.. ప్రతీ మూవీకి ఇంప్రూవ్మెంట్ చూపిస్తూ.. ప్రేక్షకుల్లో తనకంటూ గుర్తింపును, అభిమానాన్ని సంపాదించుటున్నాడు సుధీర్.
భలే మంచి రోజు మూవీలో.. పక్కింటి కుర్రాడి పాత్ర చేస్తున్నానని, అయితే స్టోరీ మాత్రం ఎవరూ ఊహించలేనంత గ్రిప్పింగ్ గా ఉంటుందని సుధీర్ చెబ్తున్నాడు. సస్పెన్స్ ని - థ్రిల్ ని ఎవరూ ఊహించలేనంత పకడ్బందీగా రూపొందించారట. అసలు భలే మంచి రోజు చిత్రానికి కథే హీరో అని.. హీరో - హీరోయిన్ - విలన్ తో సంబంధం లేకుండా సక్సెస్ సాధించగల కాన్సెప్ట్ అంటున్నాడంటే.. మూవీపై టీంకి ఉన్న నమ్మకం అర్ధమవుతుంది. అయితే.. ఈ సినిమాని నిర్మించినది మాత్రం తన ఫ్రెండ్సే కావడంతో.. ప్రెజర్ గా ఫీలవుతున్నాడట. తన మీద అభిమానంతో, ఇష్టంతో.. తనను ఎలివేట్ చేయాలనే తపనతో వాళ్లు ఎక్కువగా ఖర్చు చేస్తుంటే.. వారిని వారించినట్లు చెప్పాడు సుధీర్ బాబు.
ఈ మూవీని నిర్మించిన యూవీ క్రియేషన్స్ అధినేతలు.. ప్రభాస్ కి మంచి దోస్త్ లు. అందుకే ఇప్పటికే భలే మంచి రోజు చిత్రాన్ని యంగ్ రెబెల్ స్టార్ కి చూపించారట. అయితే మహేష్ మాత్రం ఇంకా చూడలేదని సుధీర్ అంటున్నాడు. ప్రస్తుతం టైగర్ ష్రాఫ్ కి విలన్ గా ఓ హిందీ సినిమా చేస్తూ.. బాలీవుడ్ లోనూ అరంగేట్రం చేసేస్తున్నాడు. అయితే.. మహేష్ చెప్పినట్లుగా ఒక్క సినిమాతో క్లిక్ అవడం కుదరదని, నాలుగైదు సినిమా హిట్లు పడితేనే స్టార్ అవుతారని.. తన యాంగిల్ బైట పెట్టేశాడు సుధీర్ బాబు.