Begin typing your search above and press return to search.

వీరభోగ డబ్బింగ్.. సుధీర్ రెస్పాన్స్ ఇదే!

By:  Tupaki Desk   |   16 Oct 2018 1:14 PM GMT
వీరభోగ డబ్బింగ్.. సుధీర్ రెస్పాన్స్ ఇదే!
X
'వీరభోగ వసంత రాయలు' ట్రైలర్ లాంచ్ కార్యక్రమానికి ఒక్క సుధీర్ బాబు తప్ప ఈ సినిమాలోని మిగతా లీడ్ యాక్టర్స్ నారా రోహిత్.. శ్రీ విష్ణు.. శ్రియ శరణ్.. ఇలా అందరూ హాజరయ్యారు. ట్రైలర్ అందరినీ ఆకట్టుకుంది గానీ సుధీర్ బాబు పాత్రకు సొంత డబ్బింగ్ లేకపోవడం మాత్రం ఒకహాట్ టాపిక్ అయింది.

సుధీర్ ఓన్ వాయిస్ యింతే బాగుండేదన్న అభిప్రాయాన్ని కొంతమంది వ్యక్తం చేస్తే మరికొంతమంది మాత్రం ఈ విషయంలో ఏదో మతలబు ఉందని అనుమానపడ్డారు. వీళ్ళ అనుమానానికి తగ్గట్టే సుధీర్ బాబు 'వీరభోగ వసంత రాయలు' ట్రైలర్ ను తన ట్విట్టర్ లో షేర్ చేయకుండా 'బ్లఫ్ మాస్టర్' ట్రైలర్ ను అభినందించడంతో కొంతమంది ఫాలోయర్లు సుధీర్ బాబు ను ట్విట్టర్ లో అదే విషయాన్ని అడిగారు. దీంతో "ట్వీట్ లో వివరించలేని చాలా కారణాల వల్ల నేను వీరభోగ వసంతరాయలు' లో నా పాత్రకు డబ్బింగ్ చెప్పలేకపోయాను. అవును.. అది నా వాయిస్ కాదు" అనే షాకింగ్ సమాధానం ఇచ్చాడు.

సహజంగా ఇలాంటివి ఇగో ఇష్యూస్ తోనో లేదా పేమెంట్ లో తేడా జరగడం వల్ల గానీ లేదా క్రియేటివ్ డిఫరెన్సెస్ కారణంతోనో లేదా సమయాభావం చేతనో జరుగుతాయి. మరి సుధీర్ బాబు ఈ కారణాల్లో దేనివల్ల దూరంగా ఉన్నాడో? కారణాలు ఏవైనా రేపో మాపో ఇంటర్వ్యూ ల సమయంలో ఈ ప్రశ్న సుధీర్ కే కాదు 'వీరభోగ వసంతరాయలు' టీమ్ కి కూడా ఎదురయ్యే అవకాశం ఉంది. మరోవైపు.. తను నటించిన సినిమాకు పూర్తిగా దూరంగా ఉండడం వల్ల సుధీర్ కు ప్రత్యేకంగా ఒరిగేదీ ఏమీ ఉండదు.